lifestyle

Birth Month : పుట్టిన నెల‌ను బ‌ట్టి ఎవ‌రి మ‌న‌స్త‌త్వం ఎలా ఉంటుందో తెలుసా..?

Birth Month : మనం పుట్టిన నెలను బట్టి మనం మన మనస్తత్వం గురించి తెలుసుకోవచ్చు. మరి మీ మనస్తత్వం గురించి కూడా చూడండి. జనవరి నెలలో పుట్టిన వాళ్ళు అందంగా ఉంటారు. కలల్ని నిజం చేసుకుంటూ ఉంటారు. ఎక్కడైనా తగ్గగలరు. అలానే నెగ్గగలరు. అనుకున్నది సాధిస్తారు. పట్టుదలని వదలరు. తెలివితేటలు కూడా వీళ్ళకి ఎక్కువే. ఫిబ్రవరి నెలలో పుట్టిన వాళ్ళు తొందరగా బాధపడతారు. కోపం కూడా వీళ్ళకి ఎక్కువ. వెంటనే ఎదుట వాళ్ళ మీద కోపాన్ని చూపిస్తారు. చదువు, తెలివితేటలు, కీర్తి ప్రతిష్ట వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి.

మార్చి నెలలో పుట్టిన వాళ్ళు భావోద్వేగాలు ఎక్కువ చూపిస్తారు. ఎదుటివారి ఆలోచనలకు ఆ ఫీలింగ్స్ దారితీస్తాయి. రాజకీయాల మీద ఆసక్తి ఎక్కువ. గర్వంగా ఉంటారు. ఆలోచనా శక్తి కూడా ఎక్కువ. ఏప్రిల్ నెలలో పుట్టిన వాళ్ళకి నమ్మకం ఎక్కువ. ఎదుటి వాళ్ళతో పని చేయడానికి ఇష్టపడతారు. సున్నితమైన మనసు వీరిది. కోపం, తెలివితేటలు కూడా ఎక్కువే.

personality according to birth month

మే నెలలో పుట్టిన వాళ్ళు తొందరగా ఆకర్షితులు అవుతారు. అందరి మీద ప్రేమని ఒకే రకంగా చూపిస్తారు. ఓర్పు, సహనం, త్యాగబుద్ధి ఎక్కువ. ప్రయాణాలు అంటే కూడా వీళ్ళకి ఇష్టం. జూన్ నెలలో పుట్టిన వాళ్ళు కొత్త వాళ్ళతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు. తెలివితేటలు, తొందరపాటు వీళ్ళకి ఎక్కువ. జూలై నెలలో పుట్టిన వాళ్ళు, అహంకారంగా ఉంటారు. ఖ్యాతిని కోరుకుంటారు. అదృష్టం ఉంటుంది.

ఆగస్టు నెలలో పుట్టిన వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒక అనుమానంతో ఉంటారు. రహస్యాలని తెలుసుకోవడం అంటే ఇష్టం. పగటి కలలు కనడం అంటే ఇష్టం. స్వయం శక్తితో ముందుకొస్తారు. సెప్టెంబర్ నెలలో పుట్టిన వాళ్ళు, స్నేహితులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. భయం ఉండదు. తెలివితేటలు ఎక్కువ. చురుకుగా ఉంటారు. అక్టోబర్ నెలలో పుట్టిన వాళ్ళు అబద్ధాలు చెప్తారు కానీ నటించరు. స్నేహితులని తొందరగా బాధ పెడతారు. వీళ్ళు చాలా స్మార్ట్ గా ఉంటారు.

నవంబర్ నెలలో పుట్టిన వాళ్ళు నమ్మదగిన వాళ్ళు. విశ్వాసం ఎక్కువ. ఒక పని చేయాలనుకుంటే, దాని మీదే పూర్తి ధ్యాస పెడతారు. ధైర్యం, కోరిక, చురుకుదనం వీళ్ళ స్వభావాలు. డిసెంబర్ నెలలో పుట్టిన వాళ్లకి విశ్వాసం ఎక్కువ. అందంగా ఉంటారు. ఉదారమైన మనసు కలవారు. దేశభక్తి ఎక్కువ. వీళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ప్రతి విషయంలో కూడా పోటీ పడతారు. ప్రేమగా ఉంటారు. సులభంగా బాధపడతారు. పైన వాళ్ళతో పోల్చుకుంటే అన్ని విషయాల్లో కూడా ఉన్నతంగా ఉంటారు వీళ్ళు.

Admin

Recent Posts