హెల్త్ టిప్స్

Kamala Pandu : వ‌జ్రం కన్నా విలువైంది ఇది.. అస‌లు విడిచిపెట్ట‌కండి.. పేగుల్లోని మ‌లం మొత్తం బ‌య‌ట‌కు వ‌స్తుంది..

Kamala Pandu : ఆరెంజ్ ఫ్లేవర్ అందరికి ఇట్టే నచ్చేస్తుంది. చూడటానికి మంచి రంగు, అంతకుమించిన రుచితో ఎవరినైనా ఈ కమలా పండ్లు ఇష్టపడేలా చేస్తాయి. ఈ కమల పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. వీటిలో ఉండే పొటాషియం, విటమిన్ C, ఫాస్పరస్, బీటా కెరోటిన్ వంటివి శరీరానికి పుష్కలంగా లభిస్తాయి. శరీర పెరుగుదలకి, జీవక్రియలు సక్రమంగా పని చేయడంతోపాటు రక్తపోటును తగ్గించడానికి పొటాషియం శరీరానికి ఎంతో అవసరం. ఈ పొటాషియం మీడియం సైజు కమలా పండుతో దాదాపు 260 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. ఇక పీచు శాతం సంగతి వేరే చెప్పనక్కరలేదు.

100 గ్రాముల కమలాపండు తీసుకుంటే దీనిలో మనకు 30 మిల్లి గ్రాముల విటమిన్ సి లభిస్తుంది. విటమిన్ సి అనేది మన చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. విటమిన్ సి తో పాటు కమలా పండ్ల‌లో సిట్రిక్ యాసిడ్ ఉండటం వలన కిడ్నీలో స్టోన్స్ ను కరిగించడానికి సహకరిస్తుంది. ఐరన్ అనేది మన శరీరానికి అందాలంటే విటమిన్ సి ఎంతో అవసరం. ఎప్పుడయితే మన శరీరంలో ఐరన్ పెరుగుతుందో రక్తహీనత సమస్యలు తగ్గుతాయి. కమలాల‌లో తక్కువ కార్బోహైడ్రేట్లు తక్కువ శక్తి ఉండటం వల్ల త్వరగా అరుగుదల అనేది వస్తుంది.

kamala pandu many wonderful health benefits

మలబద్దక సమస్యతో బాధపడుతున్న వారు కమలా పండ్ల‌ను తినడం వలన జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. కమలా పండ్ల‌లో లిగ్నిన్, పెక్టీన్ అనే ఫైబర్ ఉండటం వల్ల పేగుల కదలికలు బాగా జరిగి మలబద్దకం అనేది తగ్గుముఖం పడుతుంది. సాధారణంగా కమలాల‌లో నేచురల్స్ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి డయాబెటిస్ పేషెంట్ కూడా చక్కెర స్థాయిలు పెరుగుతాయని భయం లేకుండా కమలాల‌ను నిత్యం ఆహారంగా తీసుకోవచ్చు.

ముఖ్యంగా కమలాల‌లో హెస్పిరిడిన్, యాంథోసైనోనిన్ అనే రెండు కెమికల్స్ ఉండటం వలన రక్తంలోకి చ‌క్కెరను చేరకుండా నిరోధిస్తాయి. అంతే కాకుండా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారు పడుకునే ముందు ఒక కమలాపండు తినడం వలన ట్రిప్టోఫాన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి హాయిగా నిద్ర పట్టడానికి సహకరిస్తుంది. అందువ‌ల్ల ఈ పండ్ల‌ను రోజూ తింటే అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Admin

Recent Posts