Pesarapappu Garelu : పెస‌ల‌తో గారెల‌ను ఇలా చేస్తే.. ఒకటి ఎక్కువే తింటారు.. రుచి అద్భుతంగా ఉంటుంది..

Pesarapappu Garelu : మ‌నం ఆహారంగా తీసుకునే ప‌ప్పు దినుసుల్లో పెస‌ర్లు ఒక‌టి. వీటిని ఎంతో కాలంగా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉన్నాం. పెస‌ర్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పెస‌ర్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ ల‌భిస్తాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల అధిక బ‌రువు స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ర‌క్త‌పోటు అదుపులో ఉంటుంది. చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఇలా పెస‌ర్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పెస‌ర్ల‌ను చాలా మంది మొల‌కెత్తించి తీసుకుంటూ ఉంటారు. ఇవే కాకుండా ఈ పెస‌ర్ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే గారెల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. పెస‌ర గారెలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని ఉద‌యం అల్పాహారంగా లేదా స్నాక్స్ గా తీసుకోవ‌చ్చు. పెస‌ర్ల‌తో రుచిగా గారెల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన‌న ప‌దార్తాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

పెస‌ర‌ గారెల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పెస‌ర్లు – ఒక కప్పు, త‌రిగిన ఉల్లిపాయ – 1, ప‌చ్చిమిర్చి – 5 లేదా త‌గిన‌న్ని, అల్లం – అర ఇంచు ముక్క‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 4, పుదీనా ఆకులు – గుప్పెడు, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, కొత్తిమీర – గుప్పెడు, ఉప్పు – త‌గినంత‌, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Pesarapappu Garelu recipe in telugu very tasty make them
Pesarapappu Garelu

పెస‌ర గారెల త‌యారీ విధానం..

ముందుగా పెస‌ర్ల‌ను శుభ్రంగా క‌డిగి త‌గిన‌న్ని నీళ్లు పోయాలి. వీటిపై మూత పెట్టి 7 నుండి 8 గంట‌ల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత ఇలా నాన‌బెట్టుకున్న పెస‌ర్ల నుండి గుప్పెడు పెస‌ర్ల‌ను తీసుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. మిగిలిన పెస‌ర్ల‌ను జార్ లో వేసి క‌చ్చా ప‌చ్చాగా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇదే జార్ లో నూనె త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి మ‌రీ మెత్త‌గా కాకుండా మిక్సీ ప‌ట్టుకుని అదే గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ప‌క్కకు పెట్టుకున్న పెస‌ర్ల‌ను కూడా వేసి అంతా క‌లిసేలా బాగా క‌లుపుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక పెస‌ర‌ప‌ప్పు మిశ్ర‌మాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ గారెలుగా వ‌త్తుకుని నూనెలో వేసుకోవాలి.

ఈ గారెల‌ను మ‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా క‌ర‌క‌ర‌లాడుతూ ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా పెస‌ర‌గారెలు త‌యార‌వుతాయి. వీటిని నేరుగా తిన్నా లేదా ట‌మాట కిచ‌ప్ తో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. పెస‌ర్ల‌తో అప్పుడ‌ప్పుడూ ఇలా గారెల‌ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. వీటిని అంద‌రూ ఇష్టంగా తింటారు.

D

Recent Posts