Karam Borugulu : కారం బొరుగుల త‌యారీ ఇలా.. ఒక్కసారి టేస్ట్ చేయండి.. బాగుంటాయి..

Karam Borugulu : మ‌నం బొరుగుల‌తో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బొరుగుల‌తో చేసే ఎటువంటి వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. వీటితో మ‌నం ఎంతో రుచిగా ఉండే కారం బొరుగుల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. వీటిని అంద‌రూ ఇష్టంగా తింటారు. ఈ కారం బొరుగులు సాయంత్రం స‌మ‌యాల్లో స్నాక్స్ గా తిన‌డానికి చ‌క్క‌గా ఉంటాయి. ఎంతో సులువుగా చేసే ఈ కారం బొరుగుల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కారం బొరుగుల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బొరుగులు – రెండు పెద్ద క‌ప్పులు, వెల్లుల్లి రెబ్బ‌లు – 10 నుండి 15, కారం – 2 టీ స్పూన్స్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ప‌ల్లీలు – రెండు టేబుల్ స్పూన్స్, క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు, జీల‌క‌ర్ర – పావు టీ స్పూన్, ప‌సుపు – చిటికెడు, ఉప్పు – త‌గినంత‌, పుట్నాల ప‌ప్పు – గుప్పెడు.

Karam Borugulu recipe in telugu very tasy making method
Karam Borugulu

కారం బొరుగుల త‌యారీ విధానం..

ముందుగా రోట్లో వెల్లుల్లి రెబ్బ‌లు, కారం, ఉప్పు వేసి క‌చ్చా ప‌చ్చాగా దంచుకోవాలి. త‌రువాత ఒక క‌ళాయిలో బొరుగులు వేసి క‌ర‌క‌ర‌లాడే వ‌ర‌కు వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ప‌ల్లీలు వేసి వేయించాలి. త‌రువాత వీటిని కూడా బొరుగుల గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత అదే నూనెలో క‌రివేపాకు, పుట్నాల ప‌ప్పు వేసి వేయించి వీటిని కూడా బొరుగుల గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత అదే నూనెలో జీల‌క‌ర్ర‌, దంచుకున్న వెల్లుల్లి కారం వేసి వేయించాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన త‌రువాత ఈ కారాన్ని కూడా బొరుగుల గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి కారం బొరుగుల‌కు ప‌ట్టేలా బాగా క‌లుపుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కారం బొరుగులు త‌యార‌వుతాయి. వీటిలో నిమ్మ‌ర‌సం, ఉల్లిపాయ ముక్క‌లు కలుపుకుని కూడా తిన్నవ‌చ్చు. ఈ విధంగా కారం బొరుగుల‌ను త‌యారు చేసుకుని సాయంత్రం స‌మ‌యాల్లో స్నాక్స్ గా తిన‌వ‌చ్చు. ఈ కారం బొరుగుల‌ను పిల్ల‌లు మ‌రింత ఇష్టంగా తింటారు. బ‌య‌ట దొరికే చిరుతిళ్ల‌ను తిన‌డానికి బ‌దులుగా ఇలా ఇంట్లోనే కారం బొరుగులను త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల రుచిగా ఉండ‌డంతో పాటు ఆరోగ్యానికి కూడా హాని క‌లగ‌కుండా ఉంటుంది.

D

Recent Posts