POCO M4 Pro 5G : పోకో నుంచి కొత్త 5జి స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర చాలా త‌క్కువ‌.. ఫీచ‌ర్లు అదుర్స్‌..!

POCO M4 Pro 5G : మొబైల్స్ త‌యారీదారు పోకో.. ఎం4 ప్రొ 5జి పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్ ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. గ‌తేడాది నవంబ‌ర్ నెల‌లో ప్ర‌పంచ మార్కెట్‌లో ఈ ఫోన్ విడుద‌ల కాగా.. ఇప్పుడు భార‌త్‌లో అందుబాటులోకి వ‌చ్చింది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం.

POCO M4 Pro 5G  smart phone launched in India
POCO M4 Pro 5G

పోకో ఎం4 ప్రొ 5జి స్మార్ట్ ఫోన్‌లో 6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ల‌భిస్తోంది. దీని వ‌ల్ల డిస్‌ప్లే క్వాలిటీగా ఉంటుంది. ఈ ఫోన్ లో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. అందువ‌ల్ల 5జి సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. ఈ ఫోన్ 4, 6, 8 జీబీ ర్యామ్ వేరియెంట్ల‌లో విడుద‌లైంది. 64, 128 జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్‌ల‌ను అందిస్తున్నారు. మెమొరీని కార్డు ద్వారా 1 టీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు.

ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఓఎస్‌ను అందిస్తున్నారు. అలాగే హైబ్రిడ్ డ్యుయ్ సిమ్ స్లాట్‌ను ఇచ్చారు. వెనుక వైపు 50 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరా ఉంది. దీనికి తోడు అద‌నంగా మ‌రో 8 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ కెమెరాను ఏర్పాటు చేవారు. 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరాను అందిస్తున్నారు. ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ప‌క్క భాగంలో ఉంది. ముందు వైపు 16 మెగాపిక్స‌ల్ కెమెరాను ఏర్పాటు చేశారు.

ఈ ఫోన్ కు ఐపీ 53 డ‌స్ట్‌, వాట‌ర్ రెసిస్టెంట్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఇత‌ర ఫీచ‌ర్ల‌ను కూడా ఇందులో అందిస్తున్నారు. ఈ ఫోన్‌కు ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్ ఉంది. దీని వ‌ల్ల ఫోన్ ను కేవ‌లం 59 నిమిషాల్లోనే 100 శాతం వ‌ర‌కు చార్జింగ్ పూర్తి చేసుకోవ‌చ్చు.

పోకో ఎం4 ప్రొ 5జి స్మార్ట్ ఫోన్ ప‌వ‌ర్ బ్లాక్‌, కూల్ బ్లూ, పోకో ఎల్లో క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.14,999 ఉండ‌గా.. 6జీబీ ర్యామ్, 128 జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.16,999, 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.18,999గా ఉంది. ఈ ఫోన్‌ను ఈ నెల 22వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్ర‌యించ‌నున్నారు.

Share
Editor

Recent Posts