Bhimla Nayak : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు మళ్లీ నిరాశే ఎదురు కానుందా..? అంటే అందుకు.. అవుననే.. సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ భీమ్లా నాయక్ మళ్లీ వాయిదా పడుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నెల 25వ తేదీన విడుదల చేయాలని చిత్ర నిర్మాత భావించినా.. ఆ సమయంలో పలు ఇతర మూవీలు పోటీకి వస్తుండడం.. మరోవైపు ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలపై తేలని విషయం.. వంటి అంశాల కారణంగా సినిమాను వాయిదా వేస్తేనే మంచిదనే అభిప్రాయంలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కనుక భీమ్లా నాయక్ మళ్లీ వాయిదా పడుతుందని అంటున్నారు.
ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలపై ఈ నెల 24 లేదా 25 తేదీల్లో కొత్త జీవో వస్తుందని అంటున్నారు. కానీ దీనిపై స్పష్టత లేదు. అందువల్ల సినిమాను విడుదల చేసే సాహసం చేయకపోవచ్చని అంటున్నారు. ఎలాగూ ఏపీలో టిక్కెట్ల రేట్లను పెంచుకునేలా జీవోను విడుదల చేస్తారు కనుక ఆ జీవో విడుదలయ్యాకే సినిమాను విడుదల చేద్దామని మేకర్స్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కనుక ఈ నెల 25వ తేదీన భీమ్లా నాయక్ విడుదల కాకపోవచ్చని అంటున్నారు.
ఇక ఈ నెల 25వ తేదీన వరుణ్ తేజ్ నటించిన గని సినిమాతోపాటు శర్వానంద్ నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు అనే మూవీ కూడా రిలీజ్ కానుంది. పవన్ సినిమాకు ఈ సినిమాలు అసలు పోటీ కావు.. కానీ ప్రస్తుతం సినీ రంగంలో ఉన్న సమస్యల దృష్ట్యా సినిమాను విడుదల చేసి, ఇతర చిన్న సినిమాలకు నష్టం కలిగించడం ఎందుకని పవన్ అనుకుంటున్నారట. కనుక ఈ కారణాలతో భీమ్లా నాయక్ రిలీజ్ కాదేమోనని అనిపిస్తోంది.
అయితే త్వరలోనే భీమ్లా నాయక్ విడుదలపై ఒక స్పష్టమైన ప్రకటన మాత్రం రానుందని తెలుస్తోంది. సినిమాను వాయిదా వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుండగా.. ఏప్రిల్ 1న లేదా ఏప్రిల్ నెలలోనే వేరే ఏదైనా తేదీన మూవీని విడుదల చేసే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఇక దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.