POCO M4 Pro : పోకో నుంచి ఎం4 ప్రొ స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర రూ.14వేలే..!

POCO M4 Pro : పోకో సంస్థ ఎం4 సిరీస్‌లో పోకో ఎం4 ప్రొ పేరిట త‌న లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన అమోలెడ్‌ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ల‌భిస్తుంది. ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి96 ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు.

POCO M4 Pro smart phone launched in India
POCO M4 Pro

పోకో ఎం4 ప్రొ స్మార్ట్ ఫోన్ 6/8 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్స్‌లో విడుద‌లైంది. మెమొరీని కార్డు ద్వారా 1టీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు. ఆండ్రాయిడ్ 11 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను ఇందులో అందిస్తున్నారు. డ్యుయ‌ల్ సిమ్‌ల‌తోపాటు ఒక మెమొరీని కార్డును ఇందులో వేసుకోవ‌చ్చు. హైబ్రిడ్ స్లాట్ కాదు. ఈ ఫోన్‌లో వెనుక వైపు 64 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరా ఉంది దీనికి తోడు అద‌నంగా మ‌రో 8 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్స‌ల్ మాక్రో కెమెరాల‌ను ఏర్పాటు చేశారు. ముందు వైపు 16 మెగాపిక్స‌ల్ కెమెరా ల‌భిస్తోంది.

ఈ ఫోన్‌లో ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ప‌క్క వైపున ఉంది. డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి వంటి ఇత‌ర ఫీచ‌ర్ల‌ను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. ఇందులో 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీ ఉంది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్ ఉంది. క‌నుక కేవ‌లం 60 నిమిషాల్లోనే ఫోన్ పూర్తిగా చార్జింగ్ అవుతుంది.

ఇక పోకో ఎం4 ప్రొ స్మార్ట్ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.14,999 ఉండ‌గా.. 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.16,499గా ఉంది. అదేవిధంగా 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.17,999గా ఉంది. ఈ ఫోన్ ను ఫ్లిప్‌కార్ట్‌లో మార్చి 7వ తేదీ నుంచి విక్ర‌యించ‌నున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డుల‌తో ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.1000 వ‌ర‌కు డిస్కౌంట్ ల‌భిస్తుంది.

Share
Editor

Recent Posts