Poha Sweet : అటుకుల‌తో ఈ స్వీట్‌ను చేయండి.. అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు..!

Poha Sweet : మ‌నం అటుకుల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. అటుకుల‌తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. మ‌నం అటుకుల‌తో సుల‌భంగా చేసుకోద‌గిన వంట‌కాల్లో స్వీట్ పోహా కూడా ఒక‌టి. అటుకుల‌తో చేసే వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. గుళ్ల‌ల్లో ప్ర‌సాదంగా కూడా ఈ పోహాను ఇస్తూ ఉంటారు. ఈ స్వీట్ పోహాను మ‌నం చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. కేవ‌లం 5 నిమిషాల్లోనే మ‌నం ఈ పోహాను త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ స్వీట్ పోహాను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

స్వీట్ పోహా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

లావు అటుకులు – ఒక క‌ప్పు, నెయ్యి – 2 టీ స్పూన్స్, డ్రై ఫ్రూట్స్ – త‌గినన్ని, బెల్లం తురుము -అర క‌ప్పు, నీళ్లు – పావు క‌ప్పు, ప‌చ్చి కొబ్బ‌రి తురుము – రెండు టీ స్పూన్స్, యాల‌కుల పొడి – అర టీ స్పూన్.

Poha Sweet recipe in telugu very tasty easy to make
Poha Sweet

స్వీట్ పోహా త‌యారీ విధానం..

ముందుగా అటుకుల‌ను జ‌ల్లెడ‌లో వేసి జ‌ల్లించి ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యివేడ‌య్యాక డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత బెల్లం తురుము, నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం క‌రిగిన త‌రువాత ప‌చ్చి కొబ్బ‌రి తురుము వేసి ఉడికించాలి. దీనిని రెండు నిమిషాల పాటు ఉడికించిన త‌రువాత యాల‌కుల పొడి, డ్రై ఫ్రూట్స్ వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

త‌రువాత అటుకులు వేసి అంతా క‌లిసేలా చ‌క్క‌గా క‌ల‌పాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే స్వీట్ పోహా త‌యార‌వుతుంది. అటుకులు మెత్త‌గా కావాల‌నుకునే వారు అటుకుల‌ను ఒక‌సారి నీటిలో త‌డిపి కూడా వేసుకోవ‌చ్చు. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా అప్ప‌టిక‌ప్పుడు అటుకుల‌తో రుచిగా స్వీట్ పోహాను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts