బయటి ఆహారపదార్ధాలు తినడం వలన మనం ఎన్నో రోగాల బారిన పడుతున్నాం అనే విషయం తెలిసిందే. చివరికి పండ్లపై కూడా కెమికల్స్ చల్లి.. తొందరగా పక్వానికి వచ్చేలా చేసి అమ్మేస్తున్నారు. అయితే ఇవి తింటే, తాగితే ఆరోగ్యానికి హానికరం అనే విషయం తెలిసిందే. కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో శుభ్రత లేకపోవడం, కల్తీలు జరుగుతున్న ఘటనలకు సంబంధించి ఈ మధ్య కాలంలో ఎన్నో వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. అలాంటి వారిపై ప్రభుత్వం ఎన్ని కఠిన శిక్షలు వేసిన కూడా ఎక్కడో ఒక చోట అవి రిపీట్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఫ్రూట్ జ్యూస్‌ను కల్తీ చేస్తూ ఓ ముఠా పట్టుబడింది.
అది కూడా ఆ ఫ్రూట్ జ్యూస్‌లో మనుషుల మూత్రం పోసి అమ్ముతున్న ఘటనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది.జ్యూస్‌లో మూత్రం కలుపుతున్న బాలుడిని యూపీ పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. విరక్తిపుట్టించే ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. నగరంలోని ఓ జ్యూస్ సెంటర్ వద్ద బాలుడు పండ్ల రసాల్లో మూత్రం కలుపుతున్నట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పండ్ల రసాల్లో మూత్రాన్ని కలిపి వినియోగదారులకు అందిస్తున్నట్లు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
జ్యూస్ స్టాల్‌లో సోదా చేయగా మూత్రంతో నిండిన ప్లాస్టిక్ డబ్బా కనిపించిందని వర్మ తెలిపారు. ఈ విషయమై పోలీసులు అమీర్‌ను విచారించినా సమాధానం చెప్పలేకపోయాడని ఆయన తెలిపారు. పోలీసులు అతనిని అరెస్టు చేసి అతని సహచరుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. ఈ విషయంలో న్యాయపరమైన చర్యలు కొనసాగుతున్నాయన్నారు.ఘాజియాబాద్ శివారులో అమీర్ ఖాన్ అనే వ్యక్తి ఖుషీ జ్యూస్ కార్నర్ పేరుతో ఫ్రూట్ జ్యూస్ విక్రయాలు చేస్తున్నాడు. అక్కడ తయారు చేసే జ్యూస్‌లో మనుషుల మూత్రం కలిపి.. కస్టమర్లకు అమ్ముతున్నాడు. అయితే ఆ జ్యూస్ తాగిన కొందరు కస్టమర్లకు అందులో ఏదో కలిపినట్లు అనుమానం రావడంతో తనిఖీలు చేయడంతో అసలు విషయం బయటపడింది.