Posani Krishnamurali : వాళ్ల‌ను 100 అడుగుల లోతులో బొంద పెడ‌తా.. పోసాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

Posani Krishnamurali : న‌టుడు, ర‌చయిత‌, ద‌ర్శ‌కుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పోసాని కృష్ణ‌ముర‌ళి మ‌రోమారు సీఎం జ‌గ‌న్ ను విమ‌ర్శించే వారిపై ధ్వ‌జమెత్తారు. ఏపీలో సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల విష‌యంలో ఇంకా సందిగ్ధ‌త కొన‌సాగుతున్న విష‌యం విదిత‌మే. ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన భీమ్లా నాయ‌క్ చిత్రం విడుద‌ల‌య్యాక ఏపీ ప్ర‌భుత్వం సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌పై జీవోను విడుద‌ల చేస్తుంద‌ని.. ఈ విష‌యంలో జ‌గ‌న్‌.. ప‌వ‌న్‌పై క‌క్ష క‌ట్టార‌ని కొంద‌రు ప్ర‌చారం చేస్తున్నారు. అయితే ఈ విష‌యాల‌పై పోసాని స్పందించారు.

Posani Krishnamurali  said will bury them 100 feet deep
Posani Krishnamurali

శుక్ర‌వారం సీఎం జ‌గ‌న్‌ను ఆయ‌న క్యాంపు కార్యాల‌యంలో క‌ల‌సిన అనంత‌రం పోసాని మీడియాతో మాట్లాడారు. సీఎం జ‌గ‌న్‌ను విమర్శించే వారిని 100 అడుగుల లోతులో బొంద పెడ‌తాన‌న్నారు. తాను క‌రోనా స‌మ‌యంలో క‌ష్టాల‌ను ఎదుర్కొన్నాన‌ని.. అందుకు సీఎం జ‌గ‌న్ స‌హాయం చేశార‌ని.. దానికి కృత‌జ్ఞ‌త‌గా ఆయ‌న‌కు థ్యాంక్స్ చెప్పేందుకే సీఎం జ‌గ‌న్‌ను క‌లిశాన‌ని.. పోసాని స్ప‌ష్టం చేశారు. సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌పై ఆయ‌న‌తో మాట్లాడలేద‌ని.. అయితే ఈ స‌మ‌స్య త్వ‌ర‌లోనే ప‌రిష్కారం అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉంద‌న్నారు.

ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాకు క‌ష్టాల‌ను సృష్టిస్తున్నార‌ని సీఎం జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌డం సరికాద‌ని పోసాని అన్నారు. జ‌గ‌న్ ఆ ప‌నిచేయ‌ర‌ని స్ప‌ష్టం చేశారు. కాగా పోసాని గతంలో సైతం ఇదే విష‌యంపై ప‌వ‌న్‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. దీంతో అప్ప‌ట్లో పెద్ద దుమార‌మే చెల‌రేగింది.

Editor

Recent Posts