Prasadam Pulihora : ప్ర‌సాదం పులిహోర‌ను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది.. అస‌లు విడిచిపెట్ట‌రు..!

Prasadam Pulihora : మ‌నలో చాలా మంది పులిహోర‌ను ఇష్టంగా తింటూ ఉంటారు. పులిహోర చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. అలాగే మ‌నం వివిధ రుచుల్లో ఈ పులిహోర‌ను తయారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా త‌యారు చేసుకోగ‌లిగిన పులిహోర వెరైటీలలో మెంతి పులిహోర కూడా ఒక‌టి. మెంతి పులిహోర చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువ‌గా గోదావ‌రి జిల్లాల వారు త‌యారు చేస్తూ ఉంటారు. సాధార‌ణ చింత‌పండు పులిహోర వ‌లె దీనిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా తేలిక‌. ఎంతో రుచిగా ఉండే ఈ మెంతి పులిహోర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల గురించి.. ఇప్పుడు తెలుసుకుందాం.

మెంతి పులిహోర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బియ్యం – ఒక క‌ప్పు, నీళ్లు – 2 క‌ప్పులు, మెంతులు – ఒక టేబుల్ స్పూన్, నూనె – అర క‌ప్పు, ఆవాలు – ఒక టీ స్పూన్, ప‌ల్లీలు – పావు క‌ప్పు, శ‌న‌గ‌ప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్, మిన‌ప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 4, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, ప‌సుపు – ముప్పావు టీ స్పూన్, బెల్లం తురుము – 2 టేబుల్ స్పూన్స్, ఇంగువ – పావు టీ స్పూన్, క‌రివేపాకు – 2 రెమ్మ‌లు, చిక్క‌టి చింత‌పండు గుజ్జు – అర క‌ప్పు, అల్లం తరుగు – ఒక టేబుల్ , ఉప్పు – త‌గినంత‌.

Prasadam Pulihora recipe very tasty if you make like this
Prasadam Pulihora

మెంతి పులిహోర త‌యారీ విధానం..

ముందుగా కుక్క‌ర్ లో క‌డిగిన బియ్యం, నీళ్లు పోసి మూత పెట్టి పెద్ద మంట‌పై 3 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత మూత తీసి అన్నాన్ని ప్లేట్ లో వేసి చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత క‌ళాయిలో మెంతులు వేసి చిన్న మంట‌పై దోర‌గా వేయించాలి. త‌రువాత ఈ మెంతుల‌ను జార్ లో వేసి మెత్త‌ని పొడిగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఆవాలు, ప‌ల్లీలు వేసి వేయించాలి. ప‌ల్లీలు వేగిన త‌రువాత శ‌న‌గ‌ప‌ప్పు, మిన‌ప‌ప్పు వేసి వేయించాలి. తాళింపు గింజ‌లు వేగిన త‌రువాత ఎండుమిర్చి, ప‌చ్చిమిర్చి, ప‌సుపు, బెల్లం తురుము వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ఇంగువ‌, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత చింత‌పండు గుజ్జు వేసి క‌ల‌పాలి. చింత‌పండు గుజ్జును క‌లుపుతూ ఉడికించాలి. త‌రువాత అల్లం త‌రుగు వేసి క‌ల‌పాలి. ఈ చింత‌పండు గుజ్జును నూనె పైకి తేలే వ‌ర‌కు బాగా ఉడికించిన త‌రువాత ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి అన్నం వేసి క‌ల‌పాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మెంతి పులిహోర త‌యార‌వుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారని చెప్ప‌వ‌చ్చు. వెరైటీ రుచులు కోరుకునే వారు ఇలా మెంతిపులిహోర‌ను త‌యారు చేసుకుని తీసుకోవ‌చ్చు.

Share
D

Recent Posts