Sugar Cane Juice : ద‌య‌చేసి ఇలాంటి వ్యాధులు ఉన్న‌వారు మాత్రం చెరుకు ర‌సంను చచ్చినా తాగ‌కండి..!

Sugar Cane Juice : వేస‌వి కాలం వ‌చ్చిందంటే చాలు అనేక మంది చ‌ల్ల‌ని పానీయాల‌ను ఆశ్ర‌యిస్తుంటారు. వేస‌విలో చాలా మంది కూల్ డ్రింక్స్‌, కొబ్బ‌రి బొండాలు, సోడా వంటి వాటితోపాటు చెరుకు ర‌సంను కూడా ఎక్కువ‌గానే తాగుతుంటారు. ఈ క్ర‌మంలోనే వేస‌వి సీజ‌న్‌లో మ‌న‌కు ఎక్క‌డ చూసినా ర‌హ‌దారి ప‌క్క‌న చెరుకు ర‌సం విక్ర‌యించే బండ్లు అధికంగా క‌నిపిస్తుంటాయి. అయితే చెరుకు ర‌సం ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తాగుతుంటారు. కానీ దీన్ని తాగే విష‌యంలో మాత్రం త‌ప్ప‌నిస‌రిగా కొన్ని సూచ‌న‌లు పాటించాల్సి ఉంటుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

చెరుకు ర‌సాన్ని తాగ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. దీంతో సీజ‌న్‌లో వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. చెరుకు ర‌సం మ‌న‌కు స‌హ‌జ‌సిద్ధ‌మైన ఫ్ర‌క్టోజ్‌ను అందిస్తుంది. ఇది త‌క్ష‌ణ‌మే శ‌క్తిని అందిస్తుంది, దీంతో నీర‌సం, అల‌స‌ట వెంట‌నే త‌గ్గుతాయి, మ‌ళ్లీ ప‌ని చేసేందుకు కావ‌ల్సిన శ‌క్తి ల‌భిస్తుంది, ఉత్సాహంగా మారుతారు. చెరుకు ర‌సంలో అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి, ఇది యాంటీ ఆక్సిడెంట్ల‌ను, ప్రోటీన్లను, సాల్యుబుల్ ఫైబ‌ర్‌ను కూడా ఎక్కువ మొత్తంలోనే క‌లిగి ఉంటుంది. అందువ‌ల్ల మ‌న శ‌రీరానికి పోష‌ణ‌ను అందిస్తుంది. అయితే చెరుకు ర‌సాన్ని ఎట్టి ప‌రిస్థితిలోనూ రోజూ తాగ‌కూడ‌దు. అది కూడా మోతాదుకు మించి అస‌లు తాగ‌కూడ‌దు. రోజూ పురుషులు అయితే ఒక క‌ప్పు, స్త్రీలు అయితే ముప్పావు క‌ప్పు మోతాదులోనే చెరుకు ర‌సం తాగాల్సి ఉంటుంది. అంత‌క‌న్నా మించితే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

if you have these health issues then do not take Sugar Cane Juice
Sugar Cane Juice

అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌వారు చెరుకు ర‌సాన్ని తాగ‌క‌పోవ‌డ‌మే మంచిది. డైట్ పాటించే వారు చెరుకు ర‌సంకు దూరంగా ఉండ‌డ‌మే బెట‌ర్‌. రోజూ దీన్ని తాగడం వ‌ల్ల బ‌రువు పెరిగే అవ‌కాశం ఉంటుంది. క‌నుక అధిక బ‌రువు ఉన్న‌వారు చెరుకు ర‌సాన్ని తాగ‌కూడదు. ఇక డ‌యాబెటిస్‌, కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న‌వారు, గ‌ర్భిణీలు, వృద్ధులు, 4 ఏళ్ల క‌న్నా త‌క్కువ వ‌య‌స్సు ఉన్న పిల్ల‌లు, విట‌మిన్ సప్లిమెంట్ల‌ను వాడుతున్న‌వారు, ర‌క్తాన్ని ప‌లుచ‌గా చేసే ట్యాబ్లెట్ల‌ను వేసుకుంటున్న‌వారు చెరుకు ర‌సంకు దూరంగా ఉండాలి.

ఇక కొన్ని చోట్ల చెరుకు ర‌సం తీసే వ‌ద్ద అప‌రిశుభ్రంగా ఉంటుంది. ముఖ్యంగా ఈగ‌లు వాలుతుంటాయి. క‌నుక అలాంటి చోట్ల చెరుకు ర‌సం తాగ‌క‌పోవ‌డ‌మే మంచిది. లేదంటే ఇన్‌ఫెక్ష‌న్లు వ‌చ్చే ప్ర‌మాదం ఉంటుంది. ఫుడ్ పాయిజ‌నింగ్ బారిన కూడా ప‌డ‌వ‌చ్చు. అలాగే జీర్ణ‌శ‌క్తి త‌క్కువ‌గా ఉన్న‌వారు, విరేచ‌నాల బారిన ప‌డిన వారు ఎట్టి ప‌రిస్థితిలోనూ చెరుకు ర‌సం తాగ‌కూడ‌దు. ఇక ఆరోగ్య‌వంతులు కూడా రోజూ చెరుకు ర‌సం తాగ‌డం అంత మంచిది కాదు అన్న విష‌యాన్ని తెలుసుకోవాలి. ఎప్పుడో ఒక‌సారి అయితే ఫర్వాలేదు, కానీ రోజూ చెరుకు ర‌సం తాగ‌కూడ‌దు.

Editor

Recent Posts