Prawns Dum Biryani : హోట‌ల్స్ లో వండే ప్రాన్స్ బిర్యానీని.. ఎంతో టేస్టీగా ఇంట్లోనూ ఇలా చేసుకోవ‌చ్చు..!

Prawns Dum Biryani : మ‌నం ఆహారంగా తీసుకునే స‌ముద్ర‌పు ఆహారాల్లో రొయ్య‌లు ఒక‌టి. రొయ్య‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రొయ్య‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. రొయ్య‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. రొయ్య‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. రొయ్య‌ల‌తో చేసేవంట‌కాల్లో బిర్యానీ ఒక‌టి. మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ఈ బిర్యానీ ఎక్కువ‌గా ల‌భిస్తుంది. రొయ్య‌ల బిర్యానీ కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. ఎవ‌రైనా చాలా తేలిక‌గా త‌యారు చేసుకోగ‌లిగేలా రుచిగా రొయ్య‌ల బిర్యానీని ఏ విధంగా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రొయ్య‌ల బిర్యానీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నెయ్యి – 3 టేబుల్ స్పూన్స్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, ఫ్రైడ్ ఆనియ‌న్స్ – 2 టేబుల్ స్పూన్స్.

Prawns Dum Biryani recipe in telugu very easy to make and tasty
Prawns Dum Biryani

మ్యారినేట్ చేయ‌డానికి కావ‌ల్సిన ప‌దార్థాలు..

శుభ్రం చేసిన రొయ్య‌లు – 300 గ్రా., యాల‌కులు – 5, ల‌వంగాలు – 5, న‌ల్ల యాల‌క్కాయ – 1, సాజీరా – ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క – రెండు ఇంచుల ముక్క‌, పుదీనా త‌రుగు – 2 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర త‌రుగు – 2 టేబుల్ స్పూన్స్, , త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, ఫ్రైడ్ ఆనియ‌న్స్ – అర క‌ప్పు, నెయ్యి – 3 టేబుల్ స్పూన్స్, ధ‌నియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – ఒక టీ స్పూన్ప‌సుపు – అర టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, నూనె – రెండు టేబుల్ స్పూన్స్, నిమ్మ‌ర‌సం – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత, పెరుగు – 175 ఎమ్ ఎల్.

అన్నం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నీళ్లు – 2 లీట‌ర్లు, న‌ల్ల యాల‌క్కాయ – 1, సాజీరా – ఒక టీ స్పూన్, యాల‌కులు – 4, ల‌వంగాలు – 4, దాల్చిన చెక్క – రెండు ఇంచుల ముక్క‌, బిర్యానీ ఆకు – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, ఉప్పు – 3 టీ స్పూన్స్, గంట పాటు నాన‌బెట్టిన బాస్మ‌తీ బియ్యం – ఒక‌టిన్న‌ర క‌ప్పు.

రొయ్య‌ల బిర్యానీ త‌యారీ విధానం..

ముందుగా అడుగు మందంగా ఉండే గిన్నెలో రొయ్య‌లను తీసుకోవాలి. త‌రువాత ఇందులో పెరుగు త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి రొయ్య‌లకు ప‌ట్టేట‌ట్టు బాగా కలుపుకోవాలి. త‌రువాత పెరుగు వేసి క‌ల‌పాలి. తరువాత దీనిపై మూత పెట్టి గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. త‌రువాత మ‌రో గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులో బియ్యం త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి నీటిని మ‌రిగించాలి. నీళ్లు బాగా మ‌రిగిన త‌రువాత ఇందులో బియ్యం వేసి క‌ల‌పాలి. ఈ బియ్యాన్ని పెద్ద మంట‌పై 80 శాతం వ‌ర‌కు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత అన్నాన్ని పూర్తిగా నీళ్లు పోయేలా వ‌డ‌క‌ట్టుకోవాలి. త‌రువాత అన్నాన్ని ముందుగా మ్యారినేట్ చేసుకున్న రొయ్య‌ల‌పై స‌మానంగా వేసుకోవాలి.

త‌రువాత అన్నంపై నెయ్యి, ఆనియ‌న్స్, గ‌రం మ‌సాలా వేసుకోవాలి. ఇప్పుడు గిన్నెపై మూత పెట్టి ఆవిరి బ‌య‌ట‌కు పోకుండా మైదాపిండితో సీల్ చేసుకోవాలి. త‌రువాత దీనిని 5 నిమిషాల పాటు పెద్ద మంట‌పై, 8 నిమిషాల పాటు చిన్న మంట‌పై ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత మూత తీయ‌కుండా 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. 20 నిమిషాల త‌రువాత ఈ బిర్యానీని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రొయ్య‌ల బిర్యానీ త‌యార‌వుతుంది. ఈ బిర్యానీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా రొయ్య‌ల‌తో బిర్యానీని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts