Shawarma : ర‌హ‌దారుల ప‌క్క‌న అమ్మే షావ‌ర్మాను ఎక్కువ‌గా తింటున్నారా.. ఎంత ప్ర‌మాద‌మో తెలుసా..?

Shawarma : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది త‌మ జిహ్వా చాప‌ల్యాన్ని తీర్చుకునేందుకు కొత్త కొత్త ర‌కాల ఆహారాల‌ను తింటున్నారు. అందుక‌నే కొంద‌రు వ్యాపారులు కూడా భిన్న‌మైన రెస్టారెంట్లు, బేక‌రీలు, ఫుడ్ కోర్టుల‌ను ఏర్పాటు చేసి వెరైటీ ఆహారాల‌ను అందిస్తున్నారు. అయితే అంత వ‌ర‌కు బాగానే ఉంది కానీ.. కొన్ని ర‌కాల ఆహారాల వ‌ల్ల ప్రమాదం ఎక్కువ‌గానే ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ర‌హ‌దారుల ప‌క్క‌న ఎక్కువ‌గా ల‌భించే షావ‌ర్మా వంటివి తిన‌డం వ‌ల్ల ముప్పు పొంచి ఉంటుంద‌ని అంటున్నారు. దీన్ని తింటే వ్యాధుల‌ను కొని తెచ్చుకున్న‌ట్లే అని చెబుతున్నారు. దీన్ని తిన‌డం వ‌ల్ల అనేక రోగాలు వ‌స్తాయ‌ని అంటున్నారు.

షావ‌ర్మాలో సోడియం ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక దీన్ని త‌ర‌చూ తింటే సోడియం నిల్వ‌లు శ‌రీరంలో పేరుకుపోతాయి. దీంతో గౌట్ వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. కీళ్ల‌లో స్ఫ‌టికాలు ఏర్ప‌డి తీవ్ర‌మైన నొప్పి క‌లుగుతుంది. అలాగే కిడ్నీ స్టోన్లు కూడా ఏర్ప‌డుతాయి. దీంతోపాటు పాదాల వాపులు కూడా వ‌స్తాయి. కిడ్నీల‌పై భారం ప‌డుతుంది. దీంతో కిడ్నీ వ్యాధులు వ‌చ్చేందుకు కూడా అవ‌కాశాలు ఉంటాయి. క‌నుక షావ‌ర్మాను తినే ముందు ఒక‌సారి ఆలోచించుకోవాలి.

taking Shawarma is very unhealthy to us know what happens
Shawarma

షావ‌ర్మాను కాస్తంత తిన్నా చాలు.. క్యాల‌రీలు విప‌రీతంగా వ‌స్తాయి. ఎందుకంటే ఇందులో కొవ్వు, కార్బొహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి శ‌రీరంలో చేరితే విప‌రీతంగా బ‌రువు పెరుగుతారు. దీంతో గుండె జ‌బ్బులు, డ‌యాబెటిస్ వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి. అలాగే శ‌రీరంలో కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. దీంతో హార్ట్ ఎటాక్‌లు వ‌స్తాయి. క‌నుక షావ‌ర్మాను ఎట్టి ప‌రిస్థితిలోనూ తిన‌రాదు.

ఇక షావ‌ర్మాను తిన‌డం వల్ల క్యాలరీలు అధికంగా చేరుతాయి క‌నుక విప‌రీత‌మైన బ‌ద్ద‌కం వ‌స్తుంది. లేజీగా మారిపోతారు. యాక్టివ్‌గా ఉండ‌రు. దీంతో మెద‌డు ప‌నితీరు మంద‌గిస్తుంది. అలాగే షావ‌ర్మాను చేసే వారు చాలా మంది శుభ్ర‌త‌ను పాటించ‌రు. దీంతో ఫుడ్ పాయిజ‌నింగ్ అయ్యే అవ‌కాశాలు ఉంటాయి. క‌నుక ర‌హ‌దారుల ప‌క్క‌న ఎక్క‌డ షావర్మా క‌న‌బ‌డినా స‌రే దాన్ని తినే ముందు పైన చెప్పిన విష‌యాల‌ను ఒక్క‌సారి గుర్తుకు తెచ్చుకోండి. లేదంటే డ‌బ్బులు ఇచ్చి మ‌రీ రోగాల‌ను కొనుక్కున్న‌ట్లు అవుతుంది. క‌నుక దీని విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే. లేదంటే ఇబ్బందులు త‌ప్ప‌వు.

Editor

Recent Posts