Pudina Pulao : పుదీనా పులావ్‌ని 10 నిమిషాల్లోనే ఇలా చేయ‌వ‌చ్చు.. బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌లోకి బాగుంటుంది..!

Pudina Pulao : పుదీనా.. దీనిని మ‌నం వంట‌ల్లో గార్నిష్ కోసం ఎక్కువ‌గా వాడుతూ ఉంటాము. మ‌నం చేసే వంట‌ల‌కు చ‌క్క‌టి వాస‌న‌ను, రుచిని అందించ‌డంలో పుదీనా మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. పుదీనా చ‌క్కటి వాస‌న‌తో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా క‌లిగి ఉంది. పుదీనాను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా దూరం చేసుకోవ‌చ్చు. వంట‌ల్లో వాడ‌డంతో పాటు పుదీనాతో మ‌నం ప‌చ్చ‌డి, పులావ్ వంటి వాటిని కూడా త‌యారు చేస్తూ ఉంటాము. పుదీనాతో చేసే ఈ పులావ్ చాలారుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అలాగే దీనిని ప‌ది నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. అప్ప‌టికప్పుడు పుదీనాతో రుచిగా పులావ్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పుదీనా పులావ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టేబుల్ స్పూన్స్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు – 1, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, యాల‌కులు – 4, ల‌వంగాలు – 5, సాజీరా – ఒక టీ స్పూన్, స‌న్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, ఉప్పు – త‌గినంత‌, గ‌రం మ‌సాలా -ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, పుదీనా – 50 గ్రా., పుదీనా ఆకులు – పిడికెడు, అన్నం – 100 గ్రా. ల బాస్మ‌తీ బియ్యంతో వండినంత‌, ఫ్రైడ్ ఆనియ‌న్స్ – 2 టేబుల్ స్పూన్స్.

Pudina Pulao recipe in telugu make in this way
Pudina Pulao

పుదీనా పులావ్ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె,నెయ్యి వేసి వేడి చేయాలి. త‌రువాత మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి క‌ల‌పాలి. త‌రువాత ఉప్పు, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి.దీనిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత పుదీనా పేస్ట్ వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత పుదీనా ఆకులు వేసి క‌ల‌పాలి. త‌రువాత అన్నం వేసి క‌ల‌పాలి. దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న త‌రువాత మ‌రో రెండు నిమిషాలు అలాగే ఉంచాలి.

త‌రువాత ఫ్రైడ్ ఆనియ‌న్స్ చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పుదీనా పులావ్ త‌యార‌వుతుంది. దీనిని నేరుగా తిన్నా లేదా రైతాతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు ఇలా అప్ప‌టిక‌ప్పుడు పుదీనా పులావ్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఒక్క మెతుకు కూడా విడిచిపెట్ట‌కుండా ఈ పులావ్ ను ఇంట్లో అంద‌రూ ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు.

D

Recent Posts