Pullattu : పూర్వ కాలంలో ఉదయం అల్పాహారంలో భాగంగా తీసుకునే వాటిల్లో పుల్లట్లు ఒకటి. కానీ ప్రస్తుత కాలంలో వీటిని తినే వారు చాలా తక్కువైపోయారు. వీటిని తినడం వల్ల మన శరీరానికి ఎటువంటి హాని కలగదు. కొందరు దోశ పిండిలో పుల్లటి పెరుగును లేదా పుల్లటి మజ్జిగను వేసి కలిపి పుల్లట్టులా వేస్తారు. మరి కొందరు దోశ పిండినే 15 గంటలు లేదా ఒక రోజంతా పులియ బెట్టి మరుసటి రోజు పుల్లట్టులా వేస్తారు.
పుల్లట్టును తయారు చేసే పిండిలో శరీరానికి మేలు చేసే బాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతంది. పుల్లట్టు పిండిలో కొద్దిగా మీగడను కానీ, వెన్నను కానీ కలిపి వేసుకుంటే చాలా మెత్తగా ఉంటాయి. వీటిని నెయ్యి, నూనె వాడకుండా కూడా కాల్చుకోవచ్చు. రోజూ తినే అల్పాహారాలకు బదులుగా అప్పుడప్పుడూ పుల్లట్లను తయారు చేసుకుని తినవచ్చు. బరువు తగ్గడానికి కచ్చితమైన ఆహార నియమాలను కలిగి ఉన్న వారు కూడా పుల్లట్లను తినవచ్చు. పుల్లట్లను తినడం వల్ల ఎక్కువగా ఆకలిగా అనిపించదు.
శరీరానికి హాని కలగకుండా బరువు తగ్గాలనుకునే వారికి ఇవి ఎంతో సహాయపడతాయి. ఇవి పుల్లగా ఉంటాయి కనుక వీటి తయారీలో ఉప్పును ఎక్కువగా ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. కనుక బీపీ వ్యాధితో బాధపడే వారు కూడా వీటిని తినవచ్చు. పుల్లట్లను తినడం వల్ల శరీరానికి ఎటువంటి హాని కలగదు. పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, టమాట చట్నీలతో కలిపి పుల్లట్టును తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.