Punjabi Rajma Masala : పంజాబీ రాజ్మా మ‌సాలా.. ఇలా చేసి చ‌పాతీల్లో తినండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Punjabi Rajma Masala : ప్రోటీన్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల్లో రాజ్మా కూడా ఒక‌టి. ఇందులో ప్రోటీన్ తో పాటు మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఇత‌ర పోష‌కాలు కూడా ఉన్నాయి. రాజ్మాను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. పోష‌కాహార నిపుణులు కూడా వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవాలని సూచిస్తూ ఉంటారు. రాజ్మాతో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము. రాజ్మాతో చేసుకోద‌గిన వంట‌కాల్లో రాజ్మా మ‌సాలా కూడా ఒక‌టి. అన్నం, చ‌పాతీ, రోటీ వంటి వాటితో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. స్పెషల్ డేస్ లో ఇలా రాజ్మాతో రుచిగా మ‌సాలా క‌ర్రీని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. ఎంతో క‌మ్మ‌గా, రుచిగా ఉండే ఈ రాజ్మా మ‌సాలా క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

రాజ్మా మ‌సాలా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నెయ్యి – పావు కప్పు, నూనె -2 టేబుల్ స్పూన్స్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, చిన్న‌గా త‌రిగిన పెద్ద ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, ఉప్పు – కొద్దిగా, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, నీళ్లు – 50 ఎమ్ ఎల్, ట‌మాటాలు – 3, త‌రిగిన కొత్తిమీర – అర క‌ట్ట‌.

Punjabi Rajma Masala recipe in telugu very tasty with roti
Punjabi Rajma Masala

రాజ్మా ఉడికించ‌డానికి కావ‌ల్సిన ప‌దార్థాలు..

రాత్రంతా నాన‌బెట్టిన రాజ్మా – ఒక క‌ప్పు, నీళ్లు – 750 ఎమ్ ఎల్, బిర్యానీ ఆకు – 1, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, యాల‌కులు – 5, ల‌వంగాలు – 5, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు- త‌గినంత‌, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, కాశ్మీరి చిల్లీ కారం – ఒక టీ స్పూన్.

రాజ్మా మ‌సాలా త‌యారీ విధానం..

ముందుగా కుక్క‌ర్ లో నాన‌బెట్టిన రాజ్మాను క‌డిగి వేసుకోవాలి. త‌రువాత నీటితో పాటు మిగిలిన ప‌దార్థాల‌ను కూడా వేసి మూత పెట్టి 5 నుండి 6 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. త‌రువాత జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ క‌ల‌ర్ వ‌చ్చే వ‌ర‌కు వేయించిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. త‌రువాత కారం, ఉప్పు, జీల‌క‌ర్ర పొడి, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. త‌రువాత నీళ్లు పోసి నూనెపైకి తేలే వ‌ర‌కు వేయించాలి.

త‌రువాత ట‌మాటాల‌ను మెత్త‌ని పేస్ట్ లాగా చేసి వేసుకోవాలి. వీటిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత రాజ్మాను నీటితో స‌హా వేసుకోవాలి. త‌రువాత దీనిని చిన్న మంట‌పై 15 నిమిషాల పాటు ఉడికించాలి. చివ‌ర‌గా ఒక టీ స్పూన్ నెయ్యి, కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రాజ్మా మ‌సాలా త‌యార‌వుతుంది. దీనిని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. ఈ విధంగా త‌యారు చేసిన రాజ్మా మ‌సాలాను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts