Lion : మనిషి జీవితం అంటేనే.. కష్టాలు, సుఖాల కలబోత. కొందరికి ముందుగా కష్టాలు వస్తాయి. ఆ తరువాత సుఖ పడతారు. కొందరు ముందు సుఖపడి తరువాత కష్టాలను అనుభవిస్తారు. అయితే కొందరు మాత్రం ఎల్లప్పుడూ కష్టాలనే ఎదుర్కొంటూ ఉంటారు. ఏ కోశాన కూడా వారికి సమస్యలు అనేవి తగ్గవు. దీంతో అనేక విధాలుగా నష్టపోతుంటారు. అలాగే ఆర్థిక సమస్యలు చుట్టముడతాయి. కానీ వీటన్నింటికీ కొన్ని సార్లు వాస్తు దోషాలు కూడా కారణమవుతాయి. కనుక ఇంట్లో వాస్తు దోషం లేకుండా చూసుకోవాలి. అప్పుడే ఆయా సమస్యల నుంచి బయట పడేందుకు అవకాశం ఉంటుంది.
అయితే ఇంట్లో వాస్తు దోషం లేకుండా ఉండాలంటే.. అందుకు సింహం విగ్రహం ఎంతగానో ఉపయోగపడుతుంది. సింహం శక్తికి ప్రతిరూపం. అందువల్ల సింహం విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే వాస్తు పరంగా ఉండే దోషాలు అన్నీ పోతాయి. ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో అన్ని సమస్యల నుంచి బయట పడవచ్చు. అయితే ఇంట్లో సింహానికి చెందిన కాంస్య విగ్రహాన్ని మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుంది.
ఇంట్లో సింహం కాంస్య విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ మొత్తం పోయి ఇంటి నిండా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఇల్లు మొత్తం పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. దీంతో ఇంట్లోని వారికి నెమ్మదిగా అన్ని సమస్యలు తగ్గుతాయి. ఇక సింహం విగ్రహం కాస్త పెద్దగానే ఉండేలా చూసుకోవాలి. అలాగే ఆ విగ్రహాన్ని ఈశాన్య దిశగా ఉంచితే మంచిది. దీంతో అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇక కిచెన్‌లో రెండు చిన్నవైన సింహం కాంస్య విగ్రహాలను ఆగ్నేయ దిశగా వేలాడదీయాలి. దీంతో ఇంట్లో అంతా మంచే జరుగుతుంది. అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. అలాగే ఇంట్లో ఉండే హాల్‌లో అందరి చూపు పడే చోట సింహం కాంస్య విగ్రహాన్ని ఉంచాలి. దీంతో ఇంట్లోకి వచ్చే నెగెటివ్ ఎనర్జీని అది తీసుకుంటుంది. బయటకు పాజిటివ్ ఎనర్జీని పంపుతుంది. ఇది ఇల్లు మొత్తం వ్యాప్తి చెందుతుంది. దీని వల్ల వాస్తు దోషాలు పోతాయి. ఇంట్లో ఉన్న వారందరికీ ఎలాంటి సమస్యలు ఉండవు. ధనం బాగా సంపాదిస్తారు. ఆరోగ్య సమస్యలు కూడా ఉండవు. కనుక ఇంట్లో సింహం కాంస్య విగ్రహాన్ని పెట్టుకోవాలి. దీంతో అన్ని విధాలుగా మేలు జరుగుతుంది.