Radhe Shyam : ప్ర‌భాస్‌, పూజా హెగ్డె.. ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ఫ‌ర్థ‌లు అందుకే వ‌చ్చాయా ?

Radhe Shyam : ప్ర‌భాస్‌, పూజా హెగ్డె.. హీరో హీరోయిన్లుగా వ‌స్తున్న చిత్రం.. రాధేశ్యామ్‌.. ఈ సినిమా ఈ నెల 11వ తేదీన థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలోనే ఈ సినిమాకు మేక‌ర్స్ ప్ర‌స్తుతం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను చేస్తున్నారు. అయితే ప్ర‌మోష‌న్ల‌లో ఎక్క‌డా ప్ర‌భాస్‌, పూజా హెగ్డె ఒక‌రినొక‌రు చూసుకోవ‌డం లేదు. ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ఫ‌ర్థ‌లు ఉన్నాయ‌ని.. వారి హావ‌భావాల‌ను చూస్తేనే అర్థ‌మ‌వుతుంది.

Radhe Shyam this may be the reason for differences between Prabhas and Pooja Hegde
Radhe Shyam

ప్ర‌మోష‌న్ల‌లో ఒక‌రు మ‌రొక‌రి పేరు చెబుతున్నారు. కానీ అది కూడా అయిష్టంగానే పేర్ల‌ను ప‌లుకుతున్నార‌ని తెలుస్తోంది. రాధేశ్యామ్ సినిమా షూటింగ్ స‌మ‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య ఏదో జ‌రిగింద‌ని మాత్రం స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ సినిమాలో ల‌వ్, రొమాన్స్ సీన్స్‌కు కొదువ లేదు. అయితే ఆ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌లోనే పూజా హెగ్డె అభ్యంత‌రాలు చెప్పింద‌ని, దీంతో ప్ర‌భాస్‌కు, ఆమెకు మ‌న‌స్ఫ‌ర్థ‌లు వ‌చ్చాయ‌ని అంటున్నారు. ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇక ఇందులో నిజం ఎంత ఉంది.. అనేది తెలియాల్సి ఉంది.

కాగా రాధేశ్యామ్ సినిమాలో ప్ర‌భాస్ విక్ర‌మాదిత్య పాత్ర‌ను పోషించ‌గా.. పూజా హెగ్డె ప్రేర‌ణ‌గా క‌నిపించ‌నుంది. ప్ర‌భాస్ హ‌స్త‌సాముద్రికుడిగా ఇందులో క‌నిపించనున్నారు. అందులో భాగంగానే ప్ర‌మోష‌న్ల‌లో ఆయ‌న కొంద‌రికి జాత‌కాలు చూస్తూ అల‌రిస్తున్నారు.

Editor

Recent Posts