వినోదం

Ram Charan : రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన మూవీలు ఇవే.. బాక్సాఫీసు వద్ద ఈ మూవీలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ అయ్యాయి..

Ram Charan : సినీ ఇండస్ట్రీ మెగా వారసుడిగా పరిచయమై తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిరుత చిత్రంతో వెండితెరపై అడుగు పెట్టి మగధీర, ఎవడు, నాయక్, రంగస్థలం ఇలా ఎన్నో చిత్రాలతో సక్సెస్ ను అందుకుని తెలుగు తెరపై తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. హాలీవుడ్ దర్శకులు సైతం సీతారామరాజు పాత్రలో నటించిన రామ్ చరణ్ పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు.

అంతేకాకుండా చరణ్ తో చిత్రం చేయాలని ఉందనే కోరికను సైతం హాలీవుడ్ డైరెక్టర్లు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. హీరో రామ్ చరణ్ తన కెరియర్ లో 10 చిత్రాలను వదులుకున్నాడు. రామ్ చరణ్ చేతులారా వదులుకున్న ఆ పది చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ ను సాధించాయి. మరి ఆ చిత్రాలు ఏంటంటే.. డార్లింగ్ చిత్ర కథను ముందుగా రామ్ చరణ్ తో దర్శకుడు చర్చలు జరపగా, ఈ చిత్రానికి ప్రభాస్ అయితే బాగుంటుంద‌ని రామ్ చరణ్ చెప్పడంతో డార్లింగ్ చిత్ర అవకాశం ప్రభాస్ ని వరించింది.

ram charan rejected these movies but they became hit

డార్లింగ్ చిత్రంతో ప్రభాస్ మళ్లీ సక్సెస్ ఫేమ్ లోకి వచ్చి అక్కడ నుంచి తన కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోలేదు. అదే విధంగా రామ్ చరణ్ వదులుకున్న చిత్రాలు ఏమిటంటే.. దగ్గుబాటి రానా నటించిన లీడర్, కృష్ణం వందే జగద్గురుమ్, సూర్య హీరోగా నటించిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఎటో వెళ్ళిపోయింది మనసు, కృష్ణార్జున యుద్ధం, రవితేజ హీరోగా నటించిన నేల టిక్కెట్టు, దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఓకే బంగారం, మహేష్ బాబు హీరోగా నటించిన శ్రీమంతుడు, నాగచైతన్య హీరోగా నటించిన మనం వంటి సినిమాలను రామ్ చరణ్ తన చేతులారా వదులుకున్నారు. చరణ్ రిజెక్ట్ చేసిన ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించాయి.

Admin

Recent Posts