lifestyle

బైక్ మెకానిక్ లైఫే మారిపోయింది.. లాట‌రీలో రూ.25 కోట్లు వ‌చ్చాయ్‌..!

కేరళ పాండవపుర టౌన్ లో ఉండే ఒక బైక్ మెకానిక్ రూ. 25 కోట్ల రూపాయలను గెల్చుకున్నారు. తిరువనం బంపర్ లాటరీ లో 25 కోట్లను గెలుపొందినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. అల్తాఫ్ పాషా (45) ఒక లాటరీ టికెట్ ని కొనుగోలు చేశారు. దాని ధర వచ్చేసి 500 రూపాయలు. బుధవారం నాడు వాటి ఫలితాలని విడుదల చేశారు. అతను ఒక చిన్న బైక్ గ్యారేజ్ ని నడుపుతున్నారు. తన భార్య సీమతో ఒక అద్దె ఇంట్లో ఉంటున్నాడు.

వారికి 20 ఏళ్ళ కొడుకు. 19 ఏళ్ళ కూతురు ఉన్నారు. డబ్బులు లేకపోవడం వలన తన కొడుకుని స్కూలుకి కూడా పంపించట్లేదు. కొడుకు కూడా తండ్రి తో పాటుగా గ్యారేజ్ లో పనులు చేస్తూ ఉంటాడు. అతనికి బంపర్ ప్రైజ్ వచ్చిన తర్వాత పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్లి తన ఆనందాన్ని భార్యాబిడ్డలతో పంచుకున్నారు.

bike mechanic won rs 25 crore in lottery

ముందు ఆయన చెప్పేసరికి వాళ్ళు నమ్మలేదు. తర్వాత మొబైల్ ఫోన్లో ప్రూఫ్ చూపించిన తర్వాత నమ్మి సంతోషపడ్డారట. 12.8 కోట్ల రూపాయలు వస్తాయట. ఈ డబ్బుతో ముందు ఒక ఇల్లు కట్టుకుంటానని.. తర్వాత నెమ్మదిగా ఒక చిన్న వ్యాపారాన్ని మొదలు పెడతానని ఆయన చెప్పారు. అలాగే కూతురు పెళ్లి కూడా సంతోషంగా చేయచ్చని, పేదరికం అంటే ఏంటో తెలుసు కనుక పేద వాళ్లకు కూడా సహాయం చేస్తానని ఆయన చెప్తున్నారు.

Peddinti Sravya

Recent Posts