వినోదం

Viral Photo : ఈ ఫోటోలోని చిన్నారి టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా..?

Viral Photo : గత కొంతకాలంగా హీరో, హీరోయిన్లు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. అంతే కాకుండా అభిమానులతో లైవ్ చాట్ చేస్తూ టచ్ లో ఉంటున్నారు. తమకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను, అరుదైన ఫోటోలను షేర్ చేయడమే కాకుండా.. లైవ్ వీడియోల ద్వారా అభిమానుల సందేహాలకు సమాధానాలు ఇస్తున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తన చిన్ననాటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఛలో సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న గీత గోవిందం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత రష్మికకు తెలుగులో వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. దాదాపు టాలీవుడ్ టాప్ హీరోలందరితోనూ నటించే చాన్స్ దక్కించుకుంది ఈ కన్నడ భామ‌. ఇటీవల ఈ అమ్మడు అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప సినిమాలోనూ నటించింది.

rashmika mandanna childhood photo viral

పుష్పతో ఒక్కసారిగా రష్మిక రేంజ్ మారిపోయింది. ఇదే క్రమంలో నేషనల్ క్రష్ గా మారిపోయింది రష్మిక మందన్న. బాలీవుడ్‌లో గుడ్ బై, మిషన్ మజ్ను సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ అమ్మడు తన ఇన్ స్టా గ్రామ్ లో చిన్ననాటి ఫోటోను షేర్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Admin

Recent Posts