వినోదం

NTR : ఎన్‌టీఆర్‌కు త‌న తాత పేరునే ఎందుకు పెట్టారో తెలుసా..?

NTR : విశ్వ విఖ్యాత న‌ట‌నా సార్వ‌భౌమ‌.. ఈ బిరుదు చెప్ప‌గానే మ‌న‌కు గుర్తుకు వ‌చ్చే పేరు.. ఎన్‌టీఆర్‌. నంద‌మూరి తార‌క రామారావు సినిమాలతో ఎంతో మంది అభిమానుల‌ను సొంతం చేసుకున్నారు. ఆయ‌న చేయ‌ని పాత్ర లేదు. ఏ పాత్ర చేసినా అందులో జీవిస్తారు. ఆయ‌న తెలుగు సినిమాకు వ‌న్నె తెచ్చారు. ఇక కేవ‌లం సినిమాల్లోనే కాదు.. రాజ‌కీయాల్లోనూ ఆయ‌న రాణించారు. పార్టీ పెట్టిన 9 నెల‌ల్లోనే అధికారంలోకి వ‌చ్చి సీఎం అయ్యారు. దీంతో ప్ర‌జాక‌ర్ష‌క పాల‌న చేశారు. అయితే ఎన్‌టీఆర్ పేరునే హ‌రికృష్ణ కుమారుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా పెట్టుకున్నారు. ఆ పేరును ఆయ‌న తాత‌నే స్వ‌యంగా ఆయ‌న‌కు పెట్టారు. అయితే దీని వెనుక ఉన్న అస‌లు విష‌యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

జూనియ‌ర్ ఎన్‌టీఆర్ హ‌రికృష్ణ‌, షాలిని దంప‌తుల‌కు జ‌న్మించారు. 1983 మే 20న జూనియ‌ర్ ఎన్‌టీఆర్ జ‌న్మించారు. అయితే ఎన్టీఆర్ త‌న కుమారుల‌కు కృష్ణ అనే పేరు చివ‌ర్లో వ‌చ్చేలా పెట్టారు. కానీ హ‌రికృష్ణ మాత్రం త‌న కొడుకుల‌కు రామ్ అని చివ‌ర్లో వ‌చ్చేలా పెట్టారు. రాముడు అంటే ఇష్ట‌మ‌ని క‌నుక‌నే అలా పేరు పెట్టాన‌ని తెలిపారు. ఇక జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌కు తార‌క రామ్ అని మొద‌ట్లో పేరు పెట్టారు. ఈ క్ర‌మంలోనే ఒక‌సారి హ‌రికృష్ణ త‌న కుమారున్ని తీసుకుని ఎన్‌టీఆర్ వ‌ద్ద‌కు వెళ్లారు.

did you know why sr ntr put his name to jr ntr

అప్పుడు ఎన్‌టీఆర్.. తార‌క్‌ను నీ పేరు ఏంటి బాబు.. అని అడ‌గ్గా.. తార‌క రామ్ అని స‌మాధానం చెప్పాడు. దీంతో ఎన్‌టీఆర్ ఆశ్చ‌ర్య‌పోయారు. త‌న పేరును కొడుక్కి ఎందుకు పెట్టావ‌ని హ‌రికృష్ణ‌ను అడిగారు. అయితే కృష్ణ అని పెట్ట‌డం ఇష్టం లేక రామ్ అనే పేరు పెట్టాన‌ని.. అలాగే ఎన్‌టీఆర్ అనే త‌న తండ్రి పేరు క‌లిసేలా తార‌క్ అని ముందు పెట్టాన‌ని హ‌రికృష్ణ తెలిపారు. దీంతో తార‌క్ రామ్ అయింది. అయితే కాసేప‌టి త‌రువాత సీనియ‌ర్ ఎన్టీఆర్ బ‌య‌ట‌కు వ‌చ్చి తార‌క్‌తో మాట్లాడుతూ.. నువ్వు నా అంశలో జ‌న్మించావు.. క‌నుక నీ పేరు తార‌క రామారావు అని పిల‌వాలి. నువ్వు కూడా నాలాగే గొప్ప‌వాడివి అవుతావు.. అని సీనియ‌ర్ ఎన్‌టీఆర్ తార‌క్‌ను ఆశీర్వదించారు. ఇలా తార‌క్ రామ్ కాస్తా తార‌క రామారావు అయింది. అప్ప‌టి నుంచి తార‌క్ ఎన్‌టీఆర్‌గా కొన‌సాగుతున్నారు. అందుక‌నే ఆయ‌నను ఇప్ప‌టికీ తార‌క్ అని పిలుస్తుంటారు. ఇదీ.. తార‌క్‌కు ఎన్‌టీఆర్ పేరు పెట్ట‌డం వెనుక ఉన్న అస‌లు కార‌ణం..!

Admin

Recent Posts