Rashmika Mandanna : వామ్మో.. ఎన్న‌డూ లేనంత‌గా.. ర‌ష్మిక మంద‌న్న‌.. ఏంటిది ?

Rashmika Mandanna : అల్లు అర్జున్‌తో క‌లిసి పుష్ప సినిమాలో న‌టించ‌డం ఏమోగానీ క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మందన్న‌కు ఒక రేంజ్‌లో ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. అందులో భాగంగానే ఆమె హిందీలో మిష‌న్ మ‌జ్ను, గుడ్‌బై అనే సినిమాల్లో న‌టిస్తోంది. ఇక పుష్ప 2 మూవీ స‌రేస‌రి. ఈ మూవీ షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలోనే ర‌ష్మిక ప్ర‌స్తుతం త‌న కెరీర్‌లో ఎన్న‌డూ లేనంత బిజీగా గ‌డుపుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. 2021వ సంవ‌త్స‌రంలో ఆమె న‌టించిన దాదాపు అన్ని చిత్రాలు హిట్ అయ్యాయి. దీంతో ఆమె వెనుక‌కు తిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం రాలేదు. ఇక తాజాగా ఆమె చేసిన ఫొటోషూట్ మ‌తులు పోగొట్టేలా ఉంది.

Rashmika Mandanna latest cover photos trending and viral
Rashmika Mandanna

ర‌ష్మిక మందన్న తాజాగా హ‌లో అనే మ్యాగ‌జైన్‌కు ఫొటోషూట్ చేసింది. అందులో ఆమె అందాల‌ను ఆర‌బోసింది. గ్లామ‌ర్ షో చేస్తూ పిచ్చెక్కించింది. గ‌తంలో లేనంత విధంగా ఈమె గ్లామ‌ర్ షో చేయ‌డంతో ఈమె ఫొటోల‌ను చూసిన వారు షాక‌వుతున్నారు. ఎన్న‌డూ లేనిది ఈమె ఇంత‌లా ఎందుకు రెచ్చిపోతుంది ? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె లేటెస్ట్ ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి.

ఇక ర‌ష్మిక మందన్న అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ స్ట‌న్నింగ్ ఫొటోషూట్ చేసిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇప్ప‌టికే నేష‌న‌ల్ క్ర‌ష్‌గా ఉన్న ఈమె ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకుంది. ఈ ఫొటోషూట్ ద్వారా ఈమెకు మ‌రింత మంది అభిమానులు ఏర్ప‌డ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

Editor

Recent Posts