Poonam Kaur : స్టేజిపై కన్నీటి పర్యంతం అయిన పూనమ్‌ కౌర్‌.. జీవితాన్ని నాశనం చేశారంటూ..!

Poonam Kaur : నటి పూనమ్‌ కౌర్‌ ఎల్లప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం విదితమే. అందులో భాగంగానే ఆమె తరచూ ఏదో ఒక పోస్ట్‌ పెడుతూ ఉంటుంది. అది వివాదాస్పదం అవగానే దాన్ని డిలీట్‌ చేస్తుంటుంది. ఇక ఈ మధ్య కాలంలో అలాంటి పోస్టులను ఆమె ఎక్కువగానే పెట్టింది. కానీ పోస్ట్‌ చేసిన వెంటనే వాటిని డిలీట్‌ చేసింది. దీంతో ఆమె పెట్టే పోస్టుల్లో ఉండే గూడార్థాలను అందరూ వెదుకుతుంటారు. ఇక తాజాగా ఆమె మీడియా ముందటే సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం నాతి చరామి. ఈ సినిమా ఈ నెల 10వ తేదీన విడుదల కానుంది. దీన్ని ఏకంగా 20 ఓటీటీల్లో స్ట్రీమ్‌ చేయనున్నారు. అందులో భాగంగానే నిర్వహించిన మీడియా సమావేశంలో పూనమ్‌ కౌర్‌ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ దశలో ఆమె కన్నీటి పర్యంతమైంది.

Poonam Kaur cried on stage sensational comments on her life
Poonam Kaur

తాను సినిమా ఇండస్ట్రీలోకి ఎన్నో కలలతో వచ్చానని.. కానీ కొందరు రావణాసురులు తన కలను నాశనం చేశారని.. పూనమ్‌ కౌర్‌ కన్నీరు పెట్టుకుంది. కొందరు తన జీవితాన్ని నాశనం చేశారని ఆమె వ్యాఖ్యలు చేసింది. చాలా రోజుల తరువాత మీడియా ముందుకు వచ్చినందుకు సంతోషంగా ఉందంటూనే ఆమె భావోద్వేగానికి గురైంది. దీంతో పక్కనున్న వారు ఆమెను ఓదార్చారు. తన జీవితాన్ని కొందరు నాశనం చేసినందునే ఈ రోజున తాను సీత, దుర్గ, ద్రౌపదిలను తలచుకుని ధైర్యం చేసి జీవిస్తున్నానని తెలియజేసింది. అయితే ఓ దశలో సినిమాలను వదిలేసి ఇండియా నుంచి అమెరికాకు వెళ్లిపోదామని అనుకున్నానని.. కానీ ఒక ఫ్రెండ్‌ ఫోన్‌ చేసి తనకు ఈ సినిమా కథ చెప్పిందని.. ఇందులో మహిళ ప్రాధాన్యత అంశం ఉంటుందని చెప్పిందని.. అందుకనే నాతి చరామి సినిమాలో నటించానని తెలియజేసింది.

ఇక పూనమ్‌ కౌర్‌ తరచూ తనను ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తితోపాటు ఓ దర్శకుడు మోసం చేశారని.. ఆరోపణలు చేస్తూనే ఉంటుంది. గతంలో మా ఎన్నికల సందర్భంగా ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌ విజయం సాధిస్తే తనను మోసం చేసిన వారి పేర్లు చెబుతానని పేర్కొంది. కానీ ఆయన ప్యానెల్‌ గెలవలేదు. దీంతో పూనమ్‌ కౌర్‌ కొన్నాళ్ల పాటు సైలెంట్‌గా ఉంది. కానీ మళ్లీ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ అయింది. ఇక ఇటీవలే భీమ్లా నాయక్‌ సినిమా విడుదల సందర్బంగా ఆమె మరోసారి పరోక్షంగా కామెంట్లు చేసింది. అక్కా.. బావ సినిమా బాగుందంటూ ఆమె పెట్టిన పోస్ట్‌ వైరల్‌ అయింది. ఇక ఇప్పుడు ఈమె చేసిన కామెంట్స్‌ మళ్లీ వైరల్‌ అవుతున్నాయి.

Editor

Recent Posts