Rashmika Mandanna : విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఎఫైర్స్ అంటూ ప్ర‌చారం.. స్పందించిన రష్మిక మందన్న‌..

Rashmika Mandanna : ‘ఛలో’ సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయం అయిన కన్నడ భామ రష్మిక మందన. ఈ ముద్దుగుమ్మ‌ విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’ సినిమాతో తెలుగు వారికి మరింత దగ్గరైంది. గీత గోవిందం సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో విజయ్‌తో మరోసారి ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. అయితే ఈ సినిమా మాత్రం పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత ఇటీవల మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’లో నటించి రష్మిక బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.రీసెంట్‌గా పుష్ప సినిమాలో న‌టించి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది ర‌ష్మిక‌.

శ్రీ వ‌ల్లి పాత్ర‌లో ఈ ముద్దుగుమ్మ చేసిన ర‌చ్చ మాములుగా లేదు. ‘పుష్ప’ తో నేషనల్ వైడ్‌గా పాపులారిటీ సంపాదించుకుది. అంతకు ముందు ఈమె నేషనల్ క్రష్‌గా ఎంపికైనా.. పుష్పతో రష్మిక స్టార్ డమ్ పీక్స్‌కు చేరిందనే చెప్పాలి. ప్ర‌స్తుతం పుష్ప 2 చిత్రంతో ఆడ‌వాళ్లు మీకు జోహార్లు అనే సినిమాతో బిజీగా ఉంది. అలానే బాలీవుడ్ లోను ప‌లు సినిమాలు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ప్ర‌స్తుతం ర‌ష్మిక యూత్ సెన్సేష‌న్ గా మారింది. రష్మిక మందన్నా తాజా చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు ఫిబ్రవరి 25న విడుద‌ల కానుండ‌గా, ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మూవీ హీరో శర్వానంద్‌, హీరోయిన్‌ రష్మిక, డైరెక్టర్‌ పాల్గొన్నారు.

Rashmika Mandanna opens up about her effairsRashmika Mandanna opens up about her effairs
Rashmika Mandanna opens up about her effairs

ఆ స‌మ‌యంలో ఎఫైర్స్‌పై స్పందించింది ర‌ష్మిక‌. ఎవరి దగ్గర అయితే సెక్యూర్‏గా ఫీల్ అవుతామో.. కంఫర్ట్‏గా అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ స్నేహంగా ఉంటాం అనిపిస్తుందో అతడే జీవితంకు మంచి లైఫ్ పార్టనర్.. అలాంటి వాడినే భర్తకు ఎంచుకుంటాను అని పేర్కొంది. న‌టీన‌టుల జీవితంలో పుకార్లు చాలా స‌హ‌జం. మీడియా వాటి గురించి చాలా రాస్తుంది. వాటిపై స్పందించ‌ను అంటూ ర‌ష్మిక కాస్త ఘాటుగానే స్పందించింది. కాగా, కొద్ది రోజులుగా విజయ్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్నార‌ని వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే.

Editor

Recent Posts