Samantha : ఎయిర్ పోర్ట్‌లో ర‌చ్చ‌.. ఆ పాట ఏంది, ఈ ఊపుడేంది స‌మంత‌..!

Samantha : ‘ఏమాయ చేశావే’ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ స్టేట‌స్ అందుకుంది. ఈ అమ్మ‌డు ఇప్పుడు హాలీవుడ్ స్థాయికి కూడా వెళ్లింది. సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న సమంత.. ఆహా సంస్థ కోసం ‘సామ్ జామ్’ షోను హోస్టు చేసి డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్‌ను కూడా చేసింది. తెలుగు దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇది సమంత రేంజ్‌ను నేషనల్ లెవెల్‌కు పెరిగిపోయిందని చెప్పొచ్చు. ఇక అక్క‌డ నుండి స‌మంత ఏ మాత్రం ఆగ‌కుండా దూసుకుపోతుంది. వ‌రుస సినిమాలు చేస్తూ ర‌చ్చ చేస్తుంది.

ఇక నాగ చైత‌న్య నుండి విడిపోయిన స‌మంత సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ర‌చ్చ చేస్తూ వ‌స్తుంది. తన సినీ, వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఫలితంగా భారీ స్థాయిలో ఫాలోవర్లను పెంచుకుంటోంది. ఇలా తెలుగులో ఏ హీరోకూ లేనంత మంది ఫాలోవర్లను దక్కించుకుని రికార్డు క్రియేట్ చేసింది. తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తుంటుంది. తద్వారా అందాల విందు చేస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఇలా ఇప్పటికే ఎన్నోసార్లు గ్లామర్ పిక్స్‌ను వదిలింది. ఇలా అప్పుడప్పుడూ ఇంటర్నెట్‌ను ఓ ఊపు ఊపుతోంది.

samantha arabic kuthu song dance video

samantha arabic kuthu song dance video

తాజాగా సమంత ఓ ఫన్నీ వీడియోని ఇన్‌స్టాలో షేర్ చేసింది. సమంతకు లేట్ నైట్ ప్లైట్ ఉండటం, చాలా టైమ్ గ్యాప్ ఉండటంతో సరదాగా అరబిక్ కుత్తు పాటకు డాన్స్ చేసి ఇనిస్ట్రాలో పోస్ట్ చేసింది. పాటలోని సిగ్నేచర్ స్టెప్ ని ఆమే వేసి ,దుమ్మురేపింది. రిప్పడ్ జీన్స్ లో అదీ లేట్ నైట్ ఎయిర్ పోర్ట్ లో చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం నిమిషాల వ్యవదిలోనే వైరల్ గా మారడం జరిగిపోయింది. క్యాజువల్ స్టెప్ లతో సమంత సింప్లీ సూపర్ అంటూ నెటిజన్లు లైకులు కొట్టి మరీ కామెంట్లు పెడుతున్నారు.ఇటీవ‌లే పూజా హెగ్డే కూడా ఈ సాంగ్‌కి సంబంధించిన డ్యాన్స్‌ని మాల్దీవుల‌లో వేసి
ర‌చ్చ చేసిన విష‌యం తెలిసిందే.

Share
Editor

Recent Posts