realme 9 5G : రియ‌ల్‌మి నుంచి కొత్త 5జి స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర రూ.14వేలు మాత్ర‌మే..!

realme 9 5G : మొబైల్స్ త‌యారీదారు రియల్‌మి.. కొత్తగా రెండు 5జి స్మార్ట్ ఫోన్ల‌ను లాంచ్ చేసింది. రియ‌ల్‌మి 9 5జి, రియ‌ల్‌మి 9 5జి స్పీడ్ ఎడిష‌న్ పేరిట రెండు ఫోన్ల‌ను లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్ల‌లోనూ అద్భుత‌మైన ఫీచ‌ర్లు ల‌భిస్తున్నాయి. వీటి ధర కూడా చాలా త‌క్కువ‌గా ఉండ‌డం విశేషం. ఇక ఈ ఫోన్ల‌లో ఉన్న స‌దుపాయాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

realme 9 5G smart phone launched
realme 9 5G

రియ‌ల్‌మి 9 5జి స్మార్ట్ ఫోన్‌లో.. 6.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ స్క్రీన్ రిజల్యూష‌న్ క‌లిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. 4/6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్ల‌లో ఈ ఫోన్ విడుద‌లైంది. మెమొరీని కార్డు ద్వారా 1టీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు. డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌, 48, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.. వంటి ఫీచ‌ర్లు కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి.

ఇక రియ‌ల్‌మి 9 5జి స్మార్ట్ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.14,999 ఉండ‌గా, 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.17,499 గా ఉంది. ఈ ఫోన్‌ను మార్చి 14 నుంచి విక్ర‌యిస్తారు.

ఇక రియ‌ల్‌మి 9 5జి స్పీడ్ ఎడిష‌న్ స్మార్ట్ ఫోన్‌లో.. 6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 778జి ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. 6/8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్ల‌లో ఈ ఫోన్ విడుద‌లైంది. ఇందులో మెమొరీని 1టీబీ వ‌ర‌కు కార్డు ద్వారా పెంచుకోవ‌చ్చు. అలాగే డ్యుయ‌ల్ సిమ్‌ల‌ను వేసుకోవ‌చ్చు. ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌, 48, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్ వంటి ఇత‌ర ఫీచ‌ర్ల‌ను ఈ ఫోన్ లో అందిస్తున్నారు.

ఇక రియ‌ల్‌మి 9 5జి స్పీడ్ ఎడిష‌న్ స్మార్ట్ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.19,999 ఉండ‌గా.. 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.22,999 గా ఉంది. ఈ ఫోన్‌ను మార్చి 14వ తేదీ నుంచి విక్ర‌యించ‌నున్నారు.

Share
Editor

Recent Posts