realme 9 Pro : 6.6 ఇంచుల డిస్‌ప్లే, భారీ బ్యాట‌రీతో రియ‌ల్‌మి 9 ప్రొ స్మార్ట్ ఫోన్‌..!

realme 9 Pro : మొబైల్స్ త‌యారీదారు రియ‌ల్‌మి కొత్త‌గా రియల్ మి 9 ప్రొ పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్ లో విడుద‌ల చేసింది. ఇందులో పలు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. అలాగే 5జి సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. దీని ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం. ఇందులో ల‌భిస్తున్న ఫీచ‌ర్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

realme 9 Pro  smart phone launched
realme 9 Pro

రియ‌ల్‌మి 9 ప్రొ స్మార్ట్ ఫోన్‌లో 6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ల‌భిస్తుంది. అందువ‌ల్ల డిస్ ప్లే క్వాలిటీగా ఉంటుంది. ఈ ఫోన్లో ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 695 ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. దీని వ‌ల్ల 5జి కి స‌పోర్ట్ ల‌భిస్తుంది. 5జి సేవ‌ల‌ను వినియోగించుకోవ‌చ్చు. ఈ ఫోన్ 6/8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్‌ల‌లో విడుద‌లైంది. మెమొరీని కార్డు ద్వారా పెంచుకోవ‌చ్చు.

డ్యుయ‌ల్ సిమ్‌ల‌తోపాటు ఒక మెమొరీ కార్డును కూడా ఈ ఫోన్‌లో వేసుకుని ఉప‌యోగించ‌వ‌చ్చు. హైబ్రిడ్ స్లాట్ కాదు. అలాగే వెనుక వైపు 64 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాను ఏర్పాటు చేశారు. దీనికి తోడు అద‌నంగా మ‌రో 8 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉంది. 2 మెగాపిక్స‌ల్ మాక్రో కెమెరా కూడా ఉంది. ముందు వైపు 16 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది.

ఫింగ‌ర్ ప్రింట్‌ను ఈ ఫోన్‌కు ప‌క్క వైపున ఇచ్చారు. 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్ సి వంటి ఇత‌ర ఫీచ‌ర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీ ఈ ఫోన్ లో ఉంది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌ను అందిస్తున్నారు. ఇక ఈ ఫోన్ లో కావాల‌నుకుంటే అద‌నంగా మ‌రో 5 జీబీ డైన‌మిక్ ర్యామ్‌ను పెంచుకోవ‌చ్చు.

రియ‌ల్ మి 9 ప్రొ స్మార్ట్ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.17,999 ఉండ‌గా.. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.20,999 గా ఉంది. ఈ ఫోన్‌ను ఫిబ్ర‌వ‌రి 23వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌తోపాటు రియ‌ల్‌మి ఆన్‌లైన్ స్టోర్, అన్ని ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో విక్ర‌యించ‌నున్నారు. దీనిపై లాంచింగ్ ఆఫ‌ర్ల‌ల‌ను కూడా అందివ్వ‌నున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల‌తో ఈ ఫోన్‌పై రూ.2000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు.

Share
Editor

Recent Posts