Samantha : నాగ‌చైత‌న్య మొద‌టి భార్య ఎవ‌రు ? స‌మాధానం చెప్పిన స‌మంత‌..!

Samantha : గ‌తేడాది అక్టోబ‌ర్ నెల మొద‌టి వారంలో స‌మంత‌, నాగ‌చైత‌న్య విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించి వార్త‌ల్లో నిలిచారు. వారిద్ద‌రూ త‌మ నాలుగేళ్ల వివాహ బంధానికి స్వ‌స్తి ప‌లుకుతున్న‌ట్లు చెప్పారు. ఈ క్ర‌మంలోనే వారి విడాకుల వార్త సంచ‌ల‌నం అయింది. టాలీవుడ్ క్యూట్ క‌పుల్‌గా పేరుపొందిన నాగ‌చైత‌న్య‌, స‌మంత అస‌లు ఎందుకు విడిపోయారు ? అనే విష‌యం ఎవ‌రికీ తెలియ‌దు. దీనిపై ఇప్ప‌టికే చ‌ర్చ‌లు న‌డుస్తూనే ఉన్నాయి. అయితే కార‌ణాలు ఏమున్న‌ప్ప‌టికీ వారి విడాకుల విష‌యం మాత్రం సంచ‌ల‌నం అయింది. దీంతో ఇద్ద‌రూ విడిపోయి ఎవ‌రి ప‌నులు వారు చేసుకుంటూ బిజీగా మారారు. అయితే స‌మంత‌కు చెందిన కొన్ని పాత విష‌యాల‌ను నెటిజ‌న్లు బయ‌ట‌కు తీసి వాటిని వైర‌ల్ చేస్తున్నారు.

Samantha told who is Naga Chaitanya first wife
Samantha

గ‌తంలో మంచు ల‌క్ష్మి నిర్వ‌హించిన ఓ షోలో పాల్గొన్న స‌మంత ఆమె అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానాలు చెప్పింది. చైతూ బెడ్‌రూమ్‌లో ఒక‌రిని పెళ్లి చేసుకున్నాడు.. అని స‌మంత తెల‌ప‌గా.. ఆ విష‌యాన్ని వివ‌రంగా చెప్పాల‌ని మంచు ల‌క్ష్మి కోరింది. దీనికి స‌మంత బ‌దులిస్తూ.. చైతూ త‌న దిండును పెళ్లి చేసుకున్నాడు, మేము ఇద్ద‌రం కౌగిలించుకుని ప‌డుకున్నా స‌రే.. మా మ‌ధ్య అత‌ని దిండు ఉండాల్సిందే, ఈ విష‌యం మీకు చెప్పాన‌ని తెలిస్తే చైతూ న‌న్ను చంపేస్తాడు.. అని స‌మంత తెలియ‌జేసింది.

కాగా స‌మంత అన్న మాట‌ల‌కు సంబంధించిన స‌ద‌రు పాత వీడియోను కొంద‌రు వైర‌ల్ చేస్తున్నారు. చైతూ మొద‌టి భార్య అని చెప్పి పోస్టులు పెడుతున్నారు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే స‌మంత ప్ర‌స్తుతం య‌శోద అనే పాన్ ఇండియా సినిమాలో న‌టిస్తోంది. అలాగే శాకుంత‌లం, కాతు వాకుల రెండు కాద‌ల్ అనే సినిమాల్లోనూ న‌టించింది. ఈ రెండు మూవీలు త్వ‌ర‌లోనే విడుద‌ల కానున్నాయి. నాగ‌చైత‌న్య ఇటీవ‌లే థాంక్ యూ షూటింగ్ పూర్తి చేసుకోగా.. త్వ‌ర‌లో ఆయ‌న న‌టించిన హిందీ మూవీ లాల్ సింగ్ చ‌డ్డా విడుద‌ల కానుంది.

Share
Editor

Recent Posts