realme C35 : భారీ డిస్‌ప్లే, కెమెరా, బ్యాట‌రీతో వ‌చ్చిన రియ‌ల్‌మి కొత్త స్మార్ట్ ఫోన్‌..!

realme C35 : మొబైల్స్ త‌యారీదారు రియ‌ల్‌మి.. సి సిరీస్‌లో సి35 పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ ప్రాసెస‌ర్ ఉంది. 4జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్ల‌లో ఈ ఫోన్ విడుద‌లైంది. మెమొరీని కార్డు ద్వారా 1 టీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు.

realme C35 smart phone launched with huge display and battery
realme C35

రియ‌ల్‌మి సి35 స్మార్ట్ ఫోన్‌లో డ్యుయ‌ల్ సిమ్‌ల‌ను వేసుకోవ‌చ్చు. ఆండ్రాయిడ్ 11 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ల‌భిస్తుంది. వెనుక వైపు 50 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. దీనికి తోడు అద‌నంగా మ‌రో 2 మెగాపిక్స‌ల్ మాక్రో కెమెరాను ఏర్పాటు చేశారు. అలాగే వీజీఏ బ్లాక్ అండ్ వైట్ పోర్ట్రెయిట్ సెన్సార్ కూడా వెనుక వైపు ఉంది. ముందు వైపు 8 మెగాపిక్స‌ల్ కెమెరా లభిస్తుంది.

ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ఈ ఫోన్‌కు ప‌క్క వైపున అందిస్తున్నారు. డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్ వంటి ఇత‌ర ఫీచ‌ర్లు ఈ ఫోన్‌లో ల‌భిస్తున్నాయి.

ఇక రియ‌ల్ మి సి35 స్మార్ట్ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.11,999 ఉండ‌గా, 4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.12,999గా ఉంది. ఈ ఫోన్‌ను మార్చి 12వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ఇత‌ర ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో విక్ర‌యించ‌నున్నారు.

Share
Editor

Recent Posts