realme narzo 50 : రియ‌ల్‌మి నుంచి నార్జో 50 స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర కేవ‌లం రూ.12వేలే..!

realme narzo 50 : మొబైల్స్ త‌యారీదారు రియ‌ల్‌మి కొత్త‌గా నార్జో 50 పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుదల చేసింది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచర్ల‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ల‌భిస్తుంది. అందువ‌ల్ల డిస్‌ప్లే క్వాలిటీ చాలా అద్భుతంగా ఉంటుంది.

realme narzo 50  smart phone launched in India
realme narzo 50

ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి96 ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌, 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్ల‌లో ఈ ఫోన్ విడుద‌లైంది. ఇందులో మెమొరీని కార్డు ద్వారా 1టీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు. రెండు సిమ్‌ల‌ను వేసుకోవ‌చ్చు. ఆండ్రాయిడ్ 11 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ల‌భిస్తుంది. దీన్ని ఆండ్రాయిడ్ 12 కు అప్ గ్రేడ్ చేసుకోవ‌చ్చు.

రియ‌ల్‌మి నార్జో 50 స్మార్ట్ ఫోన్‌లో వెనుక వైపు 50 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరా ఉంది. మ‌రో 2 మెగాపిక్స‌ల్ పోర్ట్రెయిట్ సెన్సార్‌ను అమ‌ర్చారు. అలాగే ఇంకో 2 మెగాపిక్స‌ల్ మాక్రో కెమెరా ఉంది. ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ప‌క్క వైపున ఉంది. ముందు వైపు 16 మెగాపిక్స‌ల్ కెమెరాను ఏర్పాటు చేశారు. డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్ వంటి ఇత‌ర ఫీచ‌ర్ల‌ను కూడా ఈ ఫోన్‌లో అందిస్తున్నారు.

రియ‌ల్‌మి నార్జో 50 స్మార్ట్ ఫోన్ కు చెందిన 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.12,999 ఉండ‌గా, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.15,499గా ఉంది. ఈ ఫోన్‌ను మార్చి 3వ తేదీ నుంచి రియ‌ల్‌మి ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు అన్ని ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో విక్రయించ‌నున్నారు.

Share
Editor

Recent Posts