Redmi 10 : వాహ్‌.. అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో వ‌చ్చిన రెడ్‌మీ 10 స్మార్ట్ ఫోన్‌.. బ‌డ్జెట్ ధ‌ర‌లోనే..!

Redmi 10 : మొబైల్స్ త‌యారీదారు షియోమీ.. రెడ్‌మీ సిరీస్‌లో మ‌రో కొత్త స్మార్ట్ ఫోన్‌ను గురువారం భార‌త్‌లో విడుదల చేసింది. గ‌తేడాది రెడ్‌మీ 10 ప్రైమ్ ఫోన్‌ను విడుద‌ల చేయ‌గా.. ఇప్పుడు రెడ్‌మీ 10 ఫోన్‌ను లాంచ్ చేసింది. షియోమీ నుంచి వచ్చిన లేటెస్ట్ బ‌డ్జెట్ స్మార్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఇక ఇందులో అనేక ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. దీని ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం.

Redmi 10 smart phone launched in India with amazing features
Redmi 10

రెడ్‌మీ 10 స్మార్ట్ ఫోన్‌లో.. 6.71 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్ ల‌భిస్తుంది. ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 680 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 4/6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్లు ఇందులో ల‌భిస్తున్నాయి. ఈ ఫోన్‌లో మెమొరీని కార్డు ద్వారా 1 టీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు. ఇందులో ఆండ్రాయిడ్ 11 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ల‌భిస్తుంది.

ఈ ఫోన్‌లో రెండు సిమ్‌ల‌ను వేసుకోవ‌చ్చు. దీంతోపాటు మెమొరీ కార్డుకు ప్ర‌త్యేక స్లాట్ ఇచ్చారు. అందువ‌ల్ల హైబ్రిడ్ స్లాట్ లేదు. వెనుక వైపు 50 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాకు తోడుగా మ‌రో 2 మెగాపిక్స‌ల్ డెప్త్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. ముందు వైపు 5 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను వెనుక వైపు ఇచ్చారు. అలాగే డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.. వంటి ఇత‌ర ఫీచ‌ర్ల‌ను కూడా ఈ ఫోన్‌లో అందిస్తున్నారు.

ఇక రెడ్‌మీ 10 స్మార్ట్ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.10,999 ఉండ‌గా.. 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.12,999గా ఉంది. ఈ ఫోన్‌ను మార్చి 24వ తేదీ నుంచి విక్ర‌యించ‌నున్నారు. ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ హోమ్ స్టోర్స్‌, ఇత‌ర రిటెయిల్ స్టోర్స్‌లో ఈ ఫోన్ ల‌భిస్తుంది. దీనిపై హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల‌తో రూ.1000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ల‌భిస్తుంది.

Share
Editor

Recent Posts