Redmi Note 11 Pro : భారీ బ్యాట‌రీ, డిస్‌ప్లే, అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో.. రెడ్‌మీ నోట్ 11 ప్రొ ఫోన్లు..!

Redmi Note 11 Pro : మొబైల్స్ త‌యారీదారు షియోమీ.. రెడ్‌మీ సిరీస్‌లో రెండు నూత‌న స్మార్ట్ ఫోన్ల‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. రెడ్‌మీ నోట్ 11 ప్రొ, నోట్ 11 ప్రొ ప్ల‌స్ 5జి పేరిట ఈ ఫోన్లు విడుద‌లయ్యాయి. వీటిల్లో అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

రెడ్‌మీ నోట్ 11 ప్రొ ఫీచ‌ర్లు..

ఈ ఫోన్‌లో 6.67 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్ ల‌భిస్తుంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి96 ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. 6/8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్‌ల‌లో ఈ ఫోన్ విడుద‌లైంది. ఆండ్రాయిడ్ 11 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను ఇందులో అందిస్తున్నారు. వెనుక వైపు 108, 8, 2, 2 మెగాపిక్స‌ల్ కెమెరాలు ఉండ‌గా, ముందు వైపు 16 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్‌సి వంటి ఇత‌ర ఫీచ‌ర్ల‌ను ఇందులో అందిస్తున్నారు. ఇక ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉండ‌గా.. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. అందువ‌ల్ల ఈ ఫోన్ కేవ‌లం 15 నిమిషాల్లోనే 50 శాతం వ‌ర‌కు చార్జింగ్ పూర్త‌వుతుంది.

Redmi Note 11 Pro and Note 11 Pro Plus 5g smart phones launched
Redmi Note 11 Pro

రెడ్‌మీ నోట్ 11 ప్రొ ప్ల‌స్ 5జి ఫీచ‌ర్లు..

ఇందులో 6.67 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి కూడా గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్ ల‌భిస్తుంది. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 695 ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. 6/8జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 11 ఓఎస్ ఫీచ‌ర్లు ఇందులో ల‌భిస్తున్నాయి. వెనుక వైపు 108, 8, 2 మెగాపిక్స‌ల్ కెమెరాలు ఉండ‌గా.. ముందు వైపు 16 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్ సి ఫీచ‌ర్లను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. ఇందులోనూ 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉంది. ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్ ల‌భిస్తుంది. ఈ ఫోన్ కూడా 15 నిమిషాల్లో 50 శాతం చార్జింగ్ పూర్త‌వుతుంది.

ఇక ఈ ఫోన్ల ధ‌ర‌ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

రెడ్‌మీ నోట్ 11 ప్రొ స్మార్ట్ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.17,999 ఉండ‌గా.. 8జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.19,999గా ఉంది. మార్చి 23వ తేదీ నుంచి ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తుంది.

రెడ్‌మీ నోట్ 11 ప్రొ ప్ల‌స్ 5జి స్మార్ట్ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.20,999 ఉండ‌గా.. 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.22,999గా ఉంది. అలాగే 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.24,999గా ఉంది. ఈ ఫోన్ మార్చి 15 నుంచి వినియోగ‌దారుల‌కు ల‌భిస్తుంది.

ఇక ఈ రెండు ఫోన్లు అమెజాన్‌తోపాటు ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌, ఎంఐ హోమ్ స్టోర్స్‌, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ల‌భ్యం కానున్నాయి. లాంచింగ్ సంద‌ర్బంగా ఈ ఫోన్ల‌పై ప‌లు ఆఫ‌ర్ల‌ను కూడా అందిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల‌తో ఈ ఫోన్ల‌ను కొంటే రూ.1000 వ‌ర‌కు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు.

Share
Editor

Recent Posts