Rishabh Pant : ఆ హీరోయిన్ ను క‌లిసేందుకు 16 గంట‌లు వేచి చూసిన రిష‌బ్ పంత్‌..?

Rishabh Pant : రిష‌బ్ పంత్‌.. అంటే క్రికెట్ అభిమానుల‌కు అంద‌రికీ తెలుసు. పంత్ త‌న‌దైన బ్యాటింగ్ శైలితో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంటాడు. టీ20, వ‌న్డే, టెస్టు.. ఇలా ఫార్మాట్ ఏదైనా స‌రే.. పంత్ త‌న బ్యాటింగ్‌తో ఆక‌ట్టుకుంటుంటాడు. గ‌తంలో సెహ్వాగ్ అన్ని ఫార్మాట్ల‌లోనూ ఒకేవిధంగా ఎలా షాట్లు ఆడేవాడో.. ఇప్పుడు రిష‌బ్ పంత్ కూడా అలాగే బ్యాట్‌ను ఝులిపిస్తూ.. మంచి పేరు తెచ్చుకున్నాడు. కాగా రిష‌బ్ పంత్ ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్నాడు. అయితే రిష‌బ్ పంత్ గురించి తాజాగా ఒక వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

Rishabh Pant reportedly waited for 16 hours to meet Urvashi Rautela
Rishabh Pant

రిష‌బ్ పంత్‌.. తాజాగా ఓ చోట బాలీవుడ్ న‌టి ఊర్వ‌శి రౌతెలా ను క‌లిసేందుకు వెళ్లాడ‌ట‌. అయితే ఆమె బిజీగా ఉండ‌డం వ‌ల్ల పంత్ 16 గంట‌ల పాటు ఆమె కోసం వేచి చూశాడ‌ట‌. అయితే చివ‌ర‌కు ఇద్ద‌రూ క‌లుసుకున్నారో లేదో తెలియ‌దు కానీ ఈ వార్త మాత్రం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ప్ర‌స్తుతం ఊర్వ‌శి రౌతెలా ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా వార‌ణాసిలో ఉంది. ఆమెను క‌లిసేందుకు పంత్ ప్ర‌య‌త్నించిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇక రిష‌బ్ పంత్‌, ఊర్వ‌శి రౌతెలా లు ఎంతో కాలం నుంచి ప్రేమించుకుంటున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. వీరు త్వ‌ర‌లో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ బీ టౌన్‌లో త‌ర‌చూ వార్త‌లు ప్ర‌చారం అవుతుంటాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా ఈ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇక ఊర్వ‌శి రౌతెలా ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది.

ఊర్వ‌శి రౌతెలా గ‌తంలో జ‌రిగిన యూనివ‌ర్స్ పేజెంట్ అనే కార్య‌క్ర‌మానికి జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించింది. అలాగే అర‌బ్ సూప‌ర్ స్టార్ మ‌హ‌మ్మ‌ద్ రంజాన్‌తో క‌లిసి ఓ పాట‌కు డ్యాన్స్ చేసి అల‌రించింది. ఈమె ప్ర‌స్తుతం జియో స్టూడియోస్ నిర్మిస్తున్న ఇన్‌స్పెక్ట‌ర్ అనే వెబ్ సిరీస్‌లో న‌టిస్తోంది. అలాగే తిరుట్టు పాయ‌లే 2 హిందీ రీమేక్‌లో, బ్లాక్ రోజ్ అనే మూవీలోనూ న‌టిస్తోంది.

Editor

Recent Posts