High Blood Pressure : హైబీపీ ఉన్న‌వారు ఈ వ్యాయామాలు చేస్తే జాగ్ర‌త్త‌.. హార్ట్ ఎటాక్ వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది..!

High Blood Pressure : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది హైబీపీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. హైబీపీ వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అయితే హైబీపీ అనేది జీవిత కాల వ్యాధి. క‌నుక జీవితం మొత్తం మందుల‌ను వాడాల్సి ఉంటుంది. అలాగే వ్యాయామం చేస్తూ స‌రైన ఆహారం తీసుకోవాలి. అప్పుడే బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. కానీ హైబీపీ ఉన్న‌వారు వ్యాయామం చేసే విష‌యంలో మాత్రం చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. లేదంటే.. వ్యాయామం చేసే స‌మ‌యంలో హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు అవకాశాలు ఉంటాయి.

High Blood Pressure persons should not do these exercises
High Blood Pressure

హైబీపీ ఉన్న‌వారు తేలిక‌పాటి వ్యాయామాల‌ను చేయాలి. వాకింగ్ చేయ‌వ‌చ్చు. కానీ ర‌న్నింగ్‌, జాగింగ్‌, జంపింగ్ రోప్స్‌, ఎరోబిక్స్‌, డ్యాన్స్ వంటి వ్యాయామాలు చేయ‌రాదు. ఒక వేళ చేయాల్సి వ‌స్తే జాగ్ర‌త్త‌లు పాటించాలి. వీటిని చాలా స్లో గా చేయాలి. వేగంగా చేస్తే ఆ ప్ర‌భావం బీపీపై ప‌డుతుంది. దీంతో బీపీ పెరుగుతుంది.

హైబీపీ స‌మ‌స్య ఉన్న‌వారు ఏ వ్యాయామం చేసినా నెమ్మదిగా చేయాలి. లేదంటే బీపీ పెరుగుతుంది. అది హార్ట్ ఎటాక్‌కు కార‌ణ‌వుతుంది. ఈ క్ర‌మంలో వ్యాయామం చేసే స‌మ‌యంలోనే హార్ట్ ఎటాక్ రావ‌చ్చు. ఇక వ్యాయామం చేసే స‌మ‌యంలో బీపీ పెరిగితే అలాంటి వారికి త‌ల‌నొప్పి, ఛాతి నొప్పి, అల‌స‌ట‌, వాంతులు కావ‌డం, త‌ల తిర‌గ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. ఇలాంటి ల‌క్ష‌ణాలు వ‌స్తే వెంట‌నే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించాలి. లేదంటే ప్రాణాల‌కే ప్ర‌మాదం ఏర్ప‌డుతుంది.

ఇక జాగింగ్‌, ర‌న్నింగ్ లాంటి క‌ఠిన‌మైన వ్యాయామాలను బీపీ పేషెంట్ల చేయ‌రాదు. చేయాల్సి వ‌స్తే చాలా నెమ్మ‌దిగా చేసుకోవాలి. బీపీ పెర‌గ‌కుండా చూసుకుంటూ ఆయా వ్యాయామాలు చేయ‌వ‌చ్చు. ఇక హైబీపీ ఉన్న‌వారు రోజుకు క‌నీసం 30 నిమిషాలు వాకింగ్ చేసినా చాలు.. ఎంతో ఫ‌లితం ఉంటుంది. క‌ఠిన‌మైన వ్యాయామాల‌ను వీలైనంత వ‌ర‌కు చేయ‌కపోతేనే మంచిది.

Share
Admin

Recent Posts