Rose Syrup : బ‌య‌ట షాపుల్లో ల‌భించే రోజ్ సిర‌ప్‌.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి..!

Rose Syrup : రోస్ సిర‌ప్.. గులాబిపువ్వు వాస‌న‌తో ఈ రోస్ సిర‌ప్ తియ్య‌గా చాలా రుచిగా ఉంటుంది. దీనితో స‌మ్మ‌ర్ డ్రింక్స్, ష‌ర్బ‌త్, మిల్క్ షేక్స్ వంటి వాటిని త‌యారు చేస్తారు. రోస్ సిర‌ప్ మ‌న‌కు మార్కెట్ లో చాలా సుల‌భంగా ల‌భిస్తుంది. అయితే మార్కెట్ లో కొనే ప‌నిలేకుండా ఇంట్లోనే ఈ రోస్ సిర‌ప్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఒక్కసారి త‌యారు చేసుకుని నెల‌రోజుల పాటు దీనిని వాడుకోవ‌చ్చు. ఇంట్లోనే రోస్ సిర‌ప్ ను చాలా సుల‌భంగా ఎలా త‌యారు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

రోస్ సిర‌ప్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నీళ్లు – అర కప్పు, ఎండిన దేశ‌వాలీ గులాబీ రేకులు – 2 టేబుల్ స్పూన్స్, పంచదార – ఒక క‌ప్పు, రోస్ క‌ల‌ర్ – 2 లేదా 3 చుక్క‌లు, వెనీలా ఎసెన్స్ లేదా రోస్ ఎసెన్స్ – అర టీ స్పూన్, ఉప్పు – చిటికెడు, నిమ్మ‌ర‌సం – ఒక టీ స్పూన్.

Rose Syrup recipe in telugu make like available in shops
Rose Syrup

రోస్ సిర‌ప్ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే గులాబి రేకులు వేసి మ‌ధ్య‌స్థ మంట‌పై 3 నిమిషాల పాటు మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత వీటిపై మూత పెట్టి 2 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. త‌రువాత ఈ నీటిని వ‌డ‌క‌ట్టి గిన్నెలోకి తీసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత మ‌రో గిన్నెలో మ‌రో క‌ప్పు నీళ్లు పోయాలి. త‌రువాత పంచ‌దార వేసి వేడి చేయాలి. ఇందులోనే ముందుగా వ‌డ‌క‌ట్టిన గులాబి నీటిని పోసి వేడి చేయాలి. పంచ‌దార క‌రిగిన త‌రువాత రోస్ క‌ల‌ర్, వెనీలా ఎసెన్స్, ఉప్పు, నిమ్మ‌ర‌సం వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో 5 నిమిషాల పాటు మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల రోస్ సిర‌ప్ త‌యార‌వుతుంది. దీనిని ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల నెల నుండి రెండు నెల‌ల పాటుతాజాగా ఉంటుంది. ఈ విధంగా ఇంట్లోనే చాలా సుల‌భంగా రోస్ సిర‌ప్ ను త‌యారు చేసుకోవ‌చ్చు.

D

Recent Posts