RRR Movie First Review : ఆర్ఆర్ఆర్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది.. సినిమా ఎలా ఉందో చెప్పేశారు..!

RRR Movie First Review : ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించిన చిత్రం.. ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ ఎత్తున ఈ నెల 25వ తేదీన విడుద‌ల‌వుతోంది. ఈ క్ర‌మంలోనే చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేసింది. ఎన్‌టీఆర్‌, చ‌ర‌ణ్‌ల‌తోపాటు రాజ‌మౌళి స్వ‌యంగా చిత్ర ప్ర‌మోష‌న్‌ల‌లో పాల్గొంటున్నారు. ఇక గ‌తంలో రాజ‌మౌళి చిత్రాల‌కు రాని విధంగా భారీ స్థాయిలో ఈ చిత్రానికి హైప్ వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ఈ సినిమాకు చెందిన ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది. ఈ సినిమాకు క‌ల‌రిస్ట్‌గా ప‌నిచేసిన శివ‌కుమార్ ఈ మూవీకి రివ్యూ ఇచ్చేశారు. సినిమా ఎలా ఉందో చెప్పేశారు.

RRR Movie First Review came how is the movie
RRR Movie First Review

ఇప్పుడే ఆర్ఆర్ఆర్ మూవీ చూశా. ఒక కలరిస్ట్ గా సినిమాలోని ప్రతి ప్రేమ్ ని నేను ఆల్రెడీ 100 సార్లు చూసి ఉంటా. కానీ ఒక ప్రేక్షకుడిగా ఫైనల్ కాపీ చూసినప్పుడు ఎంతో భావోద్వేగానికి గురయ్యాను. ఒక్క విషయం క‌చ్చితంగా చెప్పగలను. ఆర్ఆర్ఆర్ మూవీ అన్ని రికార్డులనీ చెరిపివేస్తుంది. బ్రేక్ చేయలేని కొత్త రికార్డుల‌ను సృష్టిస్తుంది. బాక్సాఫీస్ వద్ద రూ.3వేల కోట్ల‌ను వసూలు చేస్తుంది. రాసి పెట్టుకోండి.. అంటూ శివకుమార్ ఈ సినిమాకు రివ్యూ ఇచ్చారు. తాజాగా ఆయ‌న త‌న టెక్నిషియ‌న్ బృందంతో క‌లిసి సినిమాకు క‌ల‌రిస్ట్‌గా ప‌నిచేశారు. అనంత‌రం ఫైన‌ల్ కాపీ చూశారు. ఈ క్ర‌మంలోనే ఆయన ఆర్ఆర్ఆర్ సినిమాకు రివ్యూ ఇచ్చారు. ఇక వ‌ర్క్ అనంత‌రం ఆయ‌న త‌న సిబ్బందితో సెల్ఫీ కూడా దిగారు.

ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చ‌రణ్ అల్లూరి పాత్ర‌లో, ఎన్‌టీఆర్ కొమురం భీమ్ పాత్ర‌లో న‌టించారు. దీంతో సినిమాలో వారి న‌ట‌న ఎలా ఉంటుందో చూడాల‌ని.. ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఇద్ద‌రు అగ్ర‌హీరోలు చేశారు క‌నుక.. ఈ విష‌యంలోనూ ఈ సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. దీంతో ప్ర‌తి ఒక్క‌రిలోనూ ఈ సినిమాను చూడాల‌నే ఉత్కంఠ రోజు రోజుకీ పెరిగిపోతోంది. మ‌రి ఈ మూవీ ఎలాంటి విజ‌యం సాధిస్తుందో చూడాలి.

Editor

Recent Posts