Disha Patani : జిమ్‌లో వ‌ర్క‌వుట్స్ చేస్తున్న దిశా ప‌టాని.. చూపు తిప్పుకోలేకుండా ఉంది.. వీడియో..!

Disha Patani : తెలుగు వెండితెర‌కు లోఫ‌ర్ అనే సినిమా ద్వారా ప‌రిచ‌యం అయింది.. దిశా ప‌టాని. ఆ సినిమా హిట్ కాలేదు. దీంతో టాలీవుడ్‌లో ఆమె ప్ర‌యాణం ఆ సినిమాతోనే ముగిసింది. ఇక తెలుగు వైపు క‌న్నెత్తి కూడా చూడ‌లేదు. కానీ బాలీవుడ్‌లో మాత్రం ఈమెకు అనేక సినిమాల్లో అవ‌కాశాలు వ‌చ్చాయి. ముఖ్యంగా బాగి 2 అనే చిత్రం ద్వారా ఈమె హిట్ సాధించింది. దీంతో ప‌లు బాలీవుడ్ సినిమాలో ఆఫ‌ర్లు వ‌చ్చాయి. అలా అక్క‌డ ఆమె విజ‌యాల ప‌రంప‌ర‌ను కొన‌సాగిస్తూనే వ‌స్తోంది. మ‌రోవైపు స్వ‌త‌హాగా మోడ‌ల్ క‌నుక ఆ రంగంలోనూ రాణిస్తోంది.

Disha Patani gym workout video
Disha Patani

ఇక సోష‌ల్ మీడియాలో దిశా ప‌టానికి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. కొన్ని ల‌క్ష‌ల సంఖ్య‌లో ఈమెకు అభిమానులు ఉన్నారు. ఈ క్ర‌మంలోనే వారి కోసం ఈమె ఎప్ప‌టిక‌ప్పుడు త‌న గ్లామ‌ర‌స్ ఫొటోల‌ను షేర్ చేస్తుంటుంది. అందులో భాగంగానే తాజాగా తాను జిమ్‌లో వ‌ర్క‌వుట్ చేస్తున్న వీడియోను ఆమె పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో వైర‌ల్ గా మారింది. ఇందులో దిశా ప‌టాని వ‌ర్క‌వుట్ చూసి మ‌తులు పోతున్నాయి.

దిశా ప‌టాని సినిమాల్లోకి రాక‌ముందే మోడ‌ల్‌. క‌నుక ఆమె ఇప్ప‌టికీ ప‌లు బ్రాండ్ల‌కు ప్ర‌చారం నిర్వ‌హిస్తుంటుంది. అయితే మోడ‌ల్ క‌నుక ఈమె ఎల్ల‌ప్పుడూ గ్లామ‌ర‌స్ ఫొటోల‌ను షేర్ చేస్తుంటుంది. అవి వైర‌ల్ అవుతుంటాయి. ఇక సినిమాల విష‌యానికి వస్తే.. ఈమె గత ఏడాది సల్మాన్ కి జంటగా రాధే అనే మూవీలో న‌టించింది. కానీ ఈ మూవీ ఫ్లాప్ అయింది. ఇక ప్రస్తుతం దిశా ప‌టాని మూడు హిందీ చిత్రాల్లో న‌టిస్తోంది. ఏక్ విలన్ రిటర్న్స్ మూవీలో జాన్ అబ్రహం, అర్జున్ కపూర్ హీరోలుగా నటిస్తున్నారు. అలాగే సిద్ధార్థ్ మల్హోత్రా లేటెస్ట్ మూవీ యోధలో ఈమె న‌టిస్తోంది. దీంతోపాటు కిత్నా అనే మరో హిందీ చిత్రంలోనూ ఈమె యాక్ట్ చేస్తోంది. ఇవి త్వ‌రలో విడుద‌ల కానున్నాయి.

Editor

Recent Posts