Bheemla Nayak : భీమ్లా నాయ‌క్ ఓటీటీ రిలీజ్ ఫిక్స్‌.. ఎప్పుడంటే..?

Bheemla Nayak : ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రానాలు ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌చ్చిన చిత్రం.. భీమ్లా నాయ‌క్‌. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 25వ తేదీన థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇప్ప‌టికీ స‌క్సెస్‌ఫుల్‌గా ప‌లు థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతూనే ఉంది. అయితే ఈ చిత్ర యూనిట్ ప్రేక్ష‌కుల‌కు శుభ‌వార్త చెప్పింది. ఈ మూవీని త్వ‌ర‌లోనే ఓటీటీలో స్ట్రీమ్ చేయ‌నున్నారు.

Bheemla Nayak movie OTT release fixed know the date
Bheemla Nayak

భీమ్లా నాయ‌క్ చిత్రానికి గాను డిజిట‌ల్ రైట్స్‌ను డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌, ఆహా సంస్థ‌లు కొనుగోలు చేసిన విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే ఈ మూవీని స్ట్రీమ్ చేసే తేదీని వారు అధికారికంగా ప్ర‌క‌టించేశారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఈ సినిమా ఆయా ఓటీటీల్లో స్ట్రీమ్ కానుంది.

వ‌చ్చే శుక్ర‌వారం ఈ టైమ్‌కు ప‌వ‌ర్ తుఫాన్ మీ ఇంటికి వ‌స్తుంది, డేట్స్ మార్క్ చేసుకోండి, క్యాలెండ‌ర్ ఖాళీగా ఉంచుకోండి.. అంటే ఆహా వీడియో వారు ట్వీట్ చేశారు. ఈ క్ర‌మంలోనే మార్చి 25వ తేదీన ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమ్ అవ‌డం ప‌క్కా అయింది.

ఇక ఈ సినిమాలో ప‌వ‌న్ ప‌క్క‌న నిత్య మీన‌న్‌, రానా ప‌క్క‌న సంయుక్త మీన‌న్‌లు న‌టించారు. ఈ చిత్రానికి సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మ‌ళ‌యాళంలో హిట్ అయిన అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీని తెర‌కెక్కించారు.

Editor

Recent Posts