Chiranjeevi : చిరంజీవి గాడ్ ఫాద‌ర్ సినిమాలో స‌ల్మాన్‌.. క‌న్‌ఫామ్‌.. షూటింగ్ మొద‌లు పెట్టేశారు..!

Chiranjeevi : బాలీవుడ్ తార‌లు అంద‌రూప్ర‌స్తుతం టాలీవుడ్ బాట ప‌డుతున్నారు. ఇప్ప‌టికే ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ఆలియాభ‌ట్‌, అజ‌య్‌దేవ‌గ‌న్‌లు తెలుగులో న‌టించ‌డం మొద‌లు పెట్టారు. దీంతో ఆలియాకు తెలుగులోనూ ప‌లు సినిమాల్లో ఆఫర్లు వ‌చ్చాయి. ఇక సాహో ద్వారా బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్ తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయింది. అయితే ఇప్పుడు స‌ల్మాన్ ఖాన్ తెలుగులో సంద‌డి చేయ‌నున్నారు. ఆయ‌న మెగాస్టార్ చిరంజీవితో కలిసి గాడ్ ఫాద‌ర్ అనే సినిమాలో న‌టించ‌నున్నారు. గతంలో ఈ విష‌యంపై వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇప్పుడు ఆ వార్త‌ల‌ను చిత్ర యూనిట్ ధ్రువీక‌రించింది.

Salman Khan in Chiranjeevi  God Father movie
Chiranjeevi

కాగా మ‌ళ‌యాళంలో హిట్ అయిన మోహ‌న్ లాల్ మూవీ లూసిఫ‌ర్‌కు రీమేక్‌గా గాడ్ ఫాద‌ర్‌ను తెర‌కెక్కిస్తున్నారు. దీనికి మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో చిరంజీవి మెయిన్ రోల్‌లో న‌టిస్తుండ‌గా.. ఆయ‌న చెల్లెలి పాత్ర‌లో న‌య‌న‌తార న‌టిస్తోంది. ఇక ఇందులో స‌ల్మాన్‌ఖాన్ న‌టిస్తున్న‌ట్లు అధికారికంగా నిర్దార‌ణ అయింది. ఈ క్ర‌మంలోనే షూటింగ్‌లో పాల్గొనేందుకు ఆయ‌న చిత్ర యూనిట్‌ను క‌లిశారు. దీంతో స‌ల్మాన్‌కు చిరంజీవి స్వాగ‌తం ప‌లికారు.

ఈ చిత్రంలో స‌ల్మాన్ న‌టిస్తున్నందుకు సంతోషంగా ఉంద‌ని ఈ సంద‌ర్బంగా చిరంజీవి ట్వీట్ కూడా చేశారు. ఇక వారం రోజుల పాటు స‌ల్మాన్ ఉన్న సీన్ల‌ను చిత్రీక‌రిస్తారు. ముంబైలోని కర్జ‌త్‌లో ఉన్న ఎన్‌డీ స్టూడియోస్‌లో ఈ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నారు. అయితే మ‌ళ‌యాళం సినిమా లూసిఫ‌ర్‌లో పృథ్వీరాజ్ సుకుమార‌న్ పాత్ర‌ను తెలుగులో స‌ల్మాన్ పోషిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇక ఇందులో ప్ర‌త్యేక సాంగ్ కోసం హాలీవుడ్ పాప్ సింగ‌ర్ బ్రిట్నీ స్పియ‌ర్స్‌ను రంగంలోకి దించుతున్న‌ట్లు తెలుస్తోంది.

Editor

Recent Posts