స‌రికొత్త హంగుల‌తో వ‌చ్చిన టీవీఎస్ కొత్త జూపిట‌ర్ మోడ‌ల్‌.. ధ‌ర ఎంతంటే..?

ద్విచ‌క్ర వాహ‌నాల త‌యారీదారు టీవీఎస్ త‌న జూపిట‌ర్ స్కూట‌ర్ల‌తో ఎంతో పేరుగాంచింది. ఈ కంపెనీకి చెందిన జూపిట‌ర్ మోడ‌ల్ స్కూట‌ర్ల‌కు సేల్ ఎక్కువ‌గా ఉంది. ఈ క్ర‌మంలోనే కొత్త కొత్త మోడ‌ల్స్‌ను ఈ వేరియెంట్‌లో టీవీఎస్ కంపెనీ ప్ర‌వేశ‌పెడుతూ వ‌స్తోంది. ఇక తాజాగా మ‌రో జూపిట‌ర్ మోడ‌ల్‌ను టీవీఎస్ లాంచ్ చేసింది. జూపిట‌ర్ జ‌డ్ఎక్స్ పేరిట మ‌రో కొత్త స్కూట‌ర్ మోడ‌ల్‌ను లాంచ్ చేశారు. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

TVS launched Jupiter ZX 2022 scooter features and price details

టీవీఎస్ జూపిట‌ర్ జ‌డ్ఎక్స్ 2022 మోడ‌ల్‌లో బ్లూటూత్ స‌దుపాయం అందిస్తున్నారు. ఫోన్‌కు ఉన్న బ్లూటూత్‌తో దీనికి క‌నెక్ట్ కావ‌చ్చు. అందుకు గాను స్మార్ట్ ఎక్స్ క‌నెక్ట్ అనే యాప్‌ను ఫోన్ లో ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని స‌హాయంతో ఫోన్‌ను స్కూట‌ర్‌కు క‌నెక్ట్ చేయ‌వ‌చ్చు. దీంతో కాల్స్‌, ఎస్ఎంఎస్ అల‌ర్ట్స్‌ల‌ను తెలుసుకోవ‌చ్చు. అలాగే దారి తెల‌య‌ని చోట నావిగేష‌న్ ఫీచ‌ర్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు.

ఇక ఈ జూపిట‌ర్ మోడ‌ల్‌లో 110 సీసీ ఇంజిన్‌ను అందిస్తున్నారు. దీని ఎక్స్ షోరూం ధ‌ర ఢిల్లీలో రూ.80,973 గా ఉంది. ఈ స్కూట‌ర్‌లో వాయిస్ అసిస్ట్ ఫీచ‌ర్‌ను కూడా అందిస్తున్నారు. బ్లూటూత్ మోడ‌ల్ అయితే రూ.3000 అద‌నంగా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఇందులో ఫుల్లీ డిజిట‌ల్ ఇన్‌స్ట్రుమెంట్ క‌న్సోల్‌ను అందిస్తున్నారు. దీంతో సుల‌భంగా కాల్, ఎస్ఎంఎస్ అల‌ర్ట్స్‌ను తెలుసుకోవ‌చ్చు. అలాగే రైడ‌ర్ హెడ్‌సెట్ ధ‌రిస్తే దానికి వాయిస్ క‌మాండ్స్ వ‌చ్చేలా సెట్ చేసుకోవ‌చ్చు.

ఇక ఈ జూపిట‌ర్ మోడ‌ల్ మ్యాట్ బ్లాక్‌, కాప‌ర్‌బ్రాంజ్ క‌ల‌ర్‌ల‌లో ల‌భిస్తోంది. 110 సీసీ ఇంజిన్ కెపాసిటీ ఉన్న ఈ స్కూట‌ర్ 8 బీహెచ్‌పీని క‌లిగి ఉంది. 7500 ఆర్‌పీఎం ను గ‌రిష్టంగా ఇస్తుంది.

Editor

Recent Posts