Samantha : సినీ ఇండ‌స్ట్రీలో 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సమంత‌.. థ్యాంక్స్ చెబుతూ ప్ర‌త్యేక పోస్ట్‌..!

Samantha : మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్ గా పేరుగాంచిన స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె న‌టించిన సినిమాల్లో చాలా వ‌ర‌కు హిట్ అయ్యాయి. ఇక ఇటీవ‌లే పుష్ప సినిమాలో ఊ అంటావా.. అనే ఐట‌మ్ సాంగ్ ద్వారా అల‌రించింది. ఈ క్ర‌మంలోనే ఈమెకు ఐట‌మ్ సాంగ్స్ ఆఫ‌ర్లు కూడా వ‌స్తున్నాయి. ఇక శ‌నివారంతో ఆమె సినీ ఇండస్ట్రీలోకి వ‌చ్చి 12 ఏళ్లు పూర్త‌యింది. దీంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టింది. త‌న 12 ఏళ్ల సినిమా కెరీర్‌లో తాను ప‌డిన ఇబ్బందులు, క‌ష్టాలు త‌దిత‌ర అన్ని వివ‌రాల‌తో ఒక పోస్ట్ షేర్ చేసింది.

Samantha completed 12 years in film industry
Samantha

ఈ రోజు నిద్ర లేచి చూసే స‌రికి సినీ ఇండ‌స్ట్రీలో నా ప్ర‌యాణానికి 12 ఏళ్లు గ‌డిచాయ‌ని తెలుసుకున్నా. ఈ 12 ఏళ్ల‌లో ఎన్నో జ్ఞాప‌కాల‌ను మ‌దిలో దాచుకున్నా. లైట్స్‌, కెమెరా, యాక్ష‌న్‌.. అన్న‌ప్పుడ‌ల్లా ఏదో తెలియ‌ని అనుభూతి క‌లుగుతుంది.. అని స‌మంత త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొంది.

త‌న‌ను ఇంత‌టి స్థాయికి చేర్చినందుకు అభిమానుల‌కు, సినీ రంగానికి స‌దా రుణ ప‌డి ఉంటాన‌ని స‌మంత తెలిపింది. త‌న‌కు ఎంతో మంది న‌మ్మ‌క‌మైన ఫ్యాన్స్ ఏర్ప‌డ్డార‌ని చెప్పింది. ఇక సినిమా త‌న‌కు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింద‌ని కూడా స‌మంత తెలియ‌జేసింది.

కాగా స‌మంత 2010లో గౌత‌మ్ మీన‌న్ తెర‌కెక్కించిన ఏ మాయ చేశావె ద్వారా వెండితెర‌కు ప‌రిచ‌యం అయింది. అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూడ‌లేదు. ద‌క్షిణాదిలో గ‌త 10 సంవ‌త్స‌రాలుగా మోస్ట్ స‌క్సెస్ ఫుల్ హీరోయిన్‌గా పేరుగాంచింది. ఏ మాయ చేశావె సినిమా షూటింగ్ స‌మయంలోనే ఈమె నాగ‌చైత‌న్య‌తో ప్రేమ‌లో ప‌డింది. త‌రువాత పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే వీరు త‌మ నాలుగేళ్ల వివాహ బంధానికి స్వ‌స్తి చెబుతూ గతేడాది అక్టోబ‌ర్‌లో విడిపోయారు. తాము విడాకులు తీసుకోబోతున్నామ‌ని తెలిపారు.

ఇక స‌మంత సినిమాల విష‌యానికి వ‌స్తే ఈమె న‌టించిన శాకుంత‌లం, కాతు వాకుల రెండు కాద‌ల్ అనే సినిమాలు విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి. శాకుంత‌లం నుంచి ఇటీవ‌లే స‌మంత ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. అందులో స‌మంత శ‌కుంత‌ల‌గా ఆక‌ట్టుకుంది. అలాగే య‌శోద అనే మరో పాన్ ఇండియా మూవీలోనూ స‌మంత న‌టిస్తోంది.

Editor

Recent Posts