Samantha : సమంత ఈ మధ్య కాలంలో వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. ఇటీవల జరిగిన ఓ అవార్డుల కార్యక్రమానికి అందాలను ఆరబోసే విధంగా ఉన్న డ్రెస్‌ను ఈమె ధరించి హాజరైంది. దీంతో ఈమె గ్లామర్ షోకు అందరూ అవాక్కయ్యారు. గతంలో ఎన్నడూ లేనిది ఈమె ఇప్పుడు ఎందుకు ఇంతలా రెచ్చిపోతుంది.. అంటూ కామెంట్లు చేశారు. అయితే ఆ కామెంట్లకు ఈమె దీటుగా బదులిచ్చింది. ఇక తాజాగా సమంత తన ఇంటి నుంచి మకాంను వేరే చోటుకు మార్చింది. అందుకు బలమైన కారణమే ఉంది.
సమంత ప్రస్తుతం యశోద అనే బహుభాషా చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. ఈ సినిమాకు గాను ఆర్ట్ డైరెక్టర్ అశోక్ 200 మంది సిబ్బందితో కలిసి 3 నెలల పాటు కష్టపడి ఓ భారీ సెట్‌ను నిర్మించారు. అది చూసేందుకు అచ్చం ఫైవ్ స్టార్ హోటల్‌ను పోలి ఉంటుంది. సకల సదుపాయాలు ఉన్నాయి. కనుకనే ఏకంగా సెట్‌కే సమంత మకాంను మార్చింది. ఇంటిని వదిలి కొద్ది రోజుల పాటు ఈ సెట్‌లోనే ఆమె నివాసం ఉండనుంది. అయితే ఇది తాత్కాలికమే. షూటింగ్ ముగిశాక ఆమె మళ్లీ ఇంటికి చేరుకోనుంది. ఇంటికి, సెట్‌కు తిరగడం ఎందుకు.. ఎలాగూ అది హోటల్‌లాగే ఉంది కదా.. అక్కడే ఉండి షూటింగ్ చేస్తే అయిపోతుందని చెప్పి సమంత ఆ సెట్‌కు తాత్కాలికంగా మకాంను మార్చింది.
ఇక యశోద సినిమాను థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్‌లు పలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు హరి శంకర్, హరీష్‌లు దర్శకత్వం వహిస్తున్నారు.