SBI : డిగ్రీ అర్హ‌త‌తో ఎస్‌బీఐలో ఉద్యోగాలు.. రూ.63వేల వ‌ర‌కు జీతం..!

SBI : దేశంలోని అతి పెద్ద ప్ర‌భుత్వ బ్యాంకింగ్ సంస్థ అయిన ఎస్‌బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) త‌మ సంస్థ‌లో ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొబేషనరీ ఆఫీసర్స్ (PO) పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. మొత్తం 3 ద‌శ‌ల్లో అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్‌, మెయిన్స్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఉద్యోగాల‌కు ఎంపిక చేస్తారు. ఉద్యోగాల‌కు ఎంపికైన వారు దేశంలో ఉన్న వివిధ ఎస్‌బీఐ కార్యాల‌యాల్లో ప‌నిచేయాల్సి ఉంటుంది.

SBI offers po jobs in various departments salary and application
SBI

ఈ ఉద్యోగాల‌కు గాను ప్రారంభ వేత‌నం రూ.36వేల నుంచి రూ.63వేల వ‌ర‌కు ఉంటుంది. అలాగే ఇత‌ర అల‌వెన్స్‌ల‌ను కూడా ఇస్తారు. ఎస్సీ, ఎస్‌టీ, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. జ‌న‌ర‌ల్‌, ఇత‌ర విభాగాల‌కు చెందిన అభ్య‌ర్థులు రూ.750 ద‌ర‌ఖాస్తు రుసుము చెల్లించాలి.

అభ్య‌ర్థులు క‌చ్చితంగా 21 నుంచి 30 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌స్సు క‌లిగి ఉండాలి. డిగ్రీ పాస్ అయిన వారు లేదా చివ‌రి సంవ‌త్స‌రం చ‌దువుతున్న వారు కూడా ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. చార్ట‌ర్డ్ అకౌంటెంట్ స‌ర్టిఫికేష‌న్ అభ్య‌ర్థులు కూడా ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. మరిన్ని వివ‌రాల‌కు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

Share
Editor

Recent Posts