Palms : ప్రస్తుత తరుణంలో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారు చాలా మంది ఉంటున్నారు. ఆర్థికపరమైన చిక్కుల్లో ఇరుకుపోయి, డబ్బులు లేక అల్లాడే వారు చాలా మందే ఉన్నారు. లక్ష్మీ దేవి అనుగ్రహం లేకపోవడం వల్లే ఇలా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటారని పండితులు చెబుతున్నారు. లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందడానికి ఏం చేయాలి.. ముఖ్యంగా సాయంత్రం ఆరు తరువాత అంటే దీపాలు వెలిగించే సమయంలో లక్ష్మీ దేవి అమ్మ వారు మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవాలంటే ఎటువంటి నియమాలను పాటించాలి.. ఎటువంటి నియమాలను పాటించకూడదు.. అస్సలు శాస్త్రం ఏం చెబుతోంది.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దీపం పెట్టే సమయంలో ఇంటి ముందు తలుపులను తెరిచి ఉంచాలి. ఇంటి వెనుక తలుపులను మూసి ఉంచాలి. అంతే కాకుండా దీపం పెట్టిన తరవాత గోర్లను కత్తిరించకూడదు. ఏడవకూడదు. తల దువ్వుకో కూడదు. సంధ్యా సమయంలో లోపే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన ఇంట్లోకి లక్ష్మీ దేవి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. లక్ష్మీ దేవి అనుగ్రహం లేని ఇల్లు ఇల్లే కాదు. లక్ష్మీ దేవి ఐశ్వర్యాన్నే కాకుండా సిరి సంపదలను, ఆయురారోగ్యాలను కూడా ప్రసాదిస్తుంది. ఆ తల్లి అనుగ్రహాన్ని పొందడం అంత సులువు కాదు. మనకు వీలైన చిన్న చిన్న సూత్రాలను పాటించడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందవచ్చు.
లక్ష్మీ దేవికి బియ్యంతో పూజ చేసి అందులో కొద్ది బియ్యాన్ని దగ్గర ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే లక్ష్మీ దేవి ప్రతిమ లేదా ఫోటో దగ్గర ఉంచే దీపం కుందుల దగ్గర బియ్యాన్ని, బంతి పూలను ఉంచాలి. లక్ష్మీ దేవి ప్రతిమకు ఒక వైపు విష్ణుమూర్తి ప్రతిమను మరో వైపు వినాయకుడి ప్రతిమను ఉంచాలి. ఇలా చేయడం వల్ల కూడా రుణ బాధలు తగ్గుతాయి. ధనం సమకూరుతుంది. అలాగే బయటకు వెళ్లేటప్పుడు చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని వెళ్లడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
ఉదయం లేవగానే అర చేతులను చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం ఆర్థికంగా నిలదొక్కుకుంటాం అని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే మన చేతి వేళ్ల చివర్లలో లక్ష్మీ దేవి ఉంటుందట. కనుక ఉదయాన్నే లేచి మొదటగా అరచేతులను, వేళ్ల చివర్లను చూసుకోవాలి. దీంతో లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది. ఇక మన ఆదాయం రెట్టింపు అవడానికి బుధవారం రోజు మట్టి కుండను నీటిలో వేయాలి. ఇలా చేయడం వల్ల మనకు వచ్చే ఆదాయం రెట్టింపు అవుతుంది. రాగి చెంబులో నీటిని నింపి పడుకునే ముందు తల దగ్గర పెట్టుకుని పడుకోవాలి. ఉదయాన్నే ఆ నీటిని పారబోయాలి. ఈ నీటిని ఎవరూ తాగకుండా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా ఆదాయం రెట్టింపు అవుతుంది.
రావి చెట్టుకు ప్రతిరోజూ నీటిని పోయడం వల్ల కూడా ఆదాయం రెట్టింపు అవుతుందని పండితులు చెబుతున్నారు. పైన చెప్పిన విధంగా లక్ష్మీ దేవిని ప్రార్థిస్తూ ఈ నియమాలను పాటించడం వల్ల మన ఆదాయం రెట్టింపు అవుతుంది. రుణ బాధలు తగ్గుతాయి. ఈ విధంగా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడవచ్చని పండితులు చెబుతున్నారు.