Small Onion Breakfast Chutney : టిఫిన్ల‌లోకి ఎప్పుడూ తినే చ‌ట్నీ కాకుండా ఇలా కొత్త‌గా ట్రై చేయండి.. అంద‌రికీ న‌చ్చుతుంది..!

Small Onion Breakfast Chutney : మ‌నం ఉద‌యం ఇడ్లీ, దోశ వంటి అల్పాహాల‌ను తిన‌డానికి ర‌క‌ర‌కాల చ‌ట్నీలను త‌యారు చేస్తూ ఉంటాము. ప‌ల్లీ చ‌ట్నీ, ట‌మాట చ‌ట్నీ, పుట్నాల చ‌ట్నీ ఇలా ర‌క‌ర‌కాల చ‌ట్నీలను త‌యారు చేస్తూ ఉంటాము. చ‌ట్నీలు రుచిగా ఉంటేనే మ‌నం త‌యారు చేసిన అల్పాహారాలు రుచిగా ఉంటాయి. మ‌నం త‌ర‌చూ చేసే చ‌ట్నీల‌తో పాటు చిన్న ఉల్లిపాయ‌ల‌తో మ‌రో రుచిక‌ర‌మైన చ‌ట్నీను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఉల్లిపాయ‌ల‌తో చేసే ఈ చ‌ట్నీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని కేవ‌లం 10 నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. అల్పాహారాల‌తో తిన‌డానికి ఈ చ‌ట్నీ చాలా చ‌క్క‌గా ఉంటుంది. రుచిగా, సుల‌భంగా ఉల్లిపాయ‌ల‌తో చ‌ట్నీని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చిన్న ఉల్లిపాయల చ‌ట్నీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్, శ‌న‌గ‌పప్పు – ఒక టీ స్పూన్, మిన‌ప‌ప్పు -ఒక టీ స్పూన్, ప‌చ్చిమిర్చి – 3, ఎండుమిర్చి – 3 లేదా 4, వెల్లుల్లి రెబ్బ‌లు – 5, చిన్న ఉల్లిపాయ‌లు – అర క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, పుదీనా – గుప్పెడు, ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు – పావు క‌ప్పు.

Small Onion Breakfast Chutney recipe in telugu very tasty
Small Onion Breakfast Chutney

తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె -ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – పావు టీ స్పూన్, జీల‌క‌ర్ర – పావు టీ స్పూన్, శ‌న‌గ‌ప‌ప్పు -అర టీ స్పూన్, మిన‌ప‌ప్పు – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, క‌రివేపాకు -ఒక రెమ్మ‌, ఇంగువ – చిటికెడు.

చిన్న ఉల్లిపాయ‌ల చ‌ట్నీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక శ‌న‌గ‌పప్పు, మిన‌ప‌ప్పు వేసి మాడిపోకుండా వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి వేయించాలి. త‌రువాత వెల్లుల్లి రెబ్బ‌లు వేసి క‌ల‌పాలి. ఇప్పుడు చిన్న ఉల్లిపాయ‌లు, ఉప్పు వేసి క‌ల‌పాలి. ఉల్లిపాయ‌లు మెత్త‌బ‌డిన త‌రువాత పుదీనా వేసి వేయించాలి. పుదీనా చ‌క్క‌గా వేగిన త‌రువాత కొబ్బ‌రి ముక్క‌లు వేసి వేయించాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా చ‌ల్లారిన త‌రువాత జార్ లోకి తీసుకోవాలి.

ఇందులోనే త‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు తాళింపుకు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు ప‌దార్థాలు వేసి వేయించాలి. వీటిని చ‌క్క‌గా వేయించి ముందుగా త‌యారు చేసుకున్న చ‌ట్నీలో వేసి క‌ల‌పాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయల చ‌ట్నీ త‌యారవుతుంది. ఇందులో చిన్న ఉల్లిపాయల‌కు బ‌దులుగా పెద్ద ఉల్లిపాయ‌ను ముక్క‌లుగా చేసి కూడా వేసుకోవ‌చ్చు. ఈ విధంగా చేసిన చ‌ట్నీని ఇడ్లీ, దోశ‌, ఊత‌ప్పం వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.

D

Recent Posts