మన చుట్టూ జరిగే వింతలు, విచిత్రాలు గురించి సోషల్ మీడియాలో తరచు మనం చూస్తూ ఉంటాం. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలని కూడా మనం చూస్తూ ఉంటాం. ఈరోజుల్లో ఏదైనా వీడియో క్షణాల్లోనే వైరల్ అయిపోతూ ఉంటోంది. వివిధ రకాల పాములు వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి.
తాజాగా ఒక పాముకి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోలో మనం సాధారణంగా పాములు ముంగిసలతో కొట్లాడడం చూస్తూ ఉంటాను. కానీ ఈ వీడియోలో అలా ఏమీ లేదు. ఓ పాము తేలుతో ఫైట్ చేయడం మనం చూడొచ్చు. పాము, తేలు కొట్టుకుంటున్న ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఏడు అడుగుల కింగ్ కోబ్రా ఒక ఇంట్లో తేలుని చూస్తుంది. నెమ్మదిగా తేలు పాముకి దగ్గరికి వెళ్తుంది. ఆఖరికి ఏం జరుగుతుంది అనేది చూపించకుండా వీడియో ముగిసిపోతుంది. అయితే ఇది ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగిందో అనే దాని గురించి సమాచారం అయితే లేదు. వైరల్ అవుతున్న ఈ వీడియో పై మీరు కూడా ఒక లుక్ వేసేయండి.