Sorakaya Pachadi : సొర‌కాయ ప‌చ్చ‌డిని ఇలా చేయండి.. నెయ్యితో అన్నంలో క‌లిపి తింటే ఎంతో బాగుంటుంది..!

Sorakaya Pachadi : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే కూర‌గాయ‌ల్లో సొర‌కాయ కూడా ఒక‌టి. సొర‌కాయ‌ను మ‌నం త‌ర‌చూ ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. సొర‌కాయ‌తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు మ‌నం ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. సొర‌కాయ‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో సొర‌కాయ ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. సొర‌కాయ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. సొర‌కాయ అంటే ఇష్టం లేని వారు కూడా ఈ ప‌చ్చ‌డిని ఇష్టంగా తింటారు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే సొర‌కాయ ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

సొర‌కాయ ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

సొర‌కాయ – 1 ( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌ది), ప‌చ్చిమిర్చి – 10, నువ్వులు – 3 టీ స్పూన్స్, నూనె – 2 టీ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, చింత‌పండు – చిన్న నిమ్మ‌కాయంత‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 4, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్.

Sorakaya Pachadi recipe in telugu make in this method
Sorakaya Pachadi

తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్, మిన‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, శ‌న‌గ‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌.

సొర‌కాయ ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో నువ్వులు వేసి వేయించాలి. త‌రువాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని ప‌క్కకు ఉంచాలి. త‌రువాత అదే క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ప‌చ్చిమిర్చి చ‌క్క‌గా వేగిన త‌రువాత వీటిని కూడా ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత అదే నూనెలో సొర‌కాయ ముక్క‌లు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత వీటిపై మూత పెట్టి ముక్క‌ల‌ను బాగా మ‌గ్గించాలి. సొర‌కాయ ముక్క‌లు ఉడికిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌నివ్వాలి. ఇప్పుడు జార్ లో నువ్వులు, ప‌చ్చిమిర్చి, ఉప్పు, చింత‌పండు, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి బ‌ర‌క‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఉడికించిన సొర‌కాయ ముక్క‌లు వేసి మ‌ర‌లా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి.

ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు ప‌దార్థాలు వేసి వేయించాలి. తాళింపు చ‌క్క‌గా వేగిన త‌రువాత దీనిని ముందుగా త‌యారు చేసుకున్న ప‌చ్చ‌డిలో వేసి క‌ల‌పాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే సొర‌కాయ ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. దీనిని అన్నం, నెయ్యితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. సొర‌కాయ‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ ప‌చ్చ‌డిని లొట్ట‌లేసుకుంటూ అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts