Eye Brows : దీన్ని రోజూ రాస్తే చాలు.. క‌నుబొమ్మ‌లు ఎంతో ఒత్తుగా, ద‌ట్టంగా పెరుగుతాయి..!

Eye Brows : మ‌న ముఖం అందంగా క‌న‌బ‌డ‌డంలో క‌నుబొమ్మ‌లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. క‌నుబొమ్మ‌లు అందంగా ఉంటేనే మ‌న ముఖం మ‌రింత అందంగా క‌న‌బ‌డుతుంది. అయితే మ‌న‌లో కొంద‌రికి క‌నుబొమ్మ‌లు ప‌లుచ‌గా ఉంటాయి. ఆ భాగంలో వెంట్రుక‌లు చాలా త‌క్కువ‌గా ఉంటాయి. క‌నుబొమ్మ‌లు ఒత్తుగా, న‌ల్ల‌గా క‌న‌బ‌డ‌డానికి ఐ బ్రో పెనిల్స్, మ‌స్కారా వంటి వాటిని ఉప‌యోగిస్తూ ఉంటారు. వీటిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల క‌నుబొమ్మ‌లు న‌ల్ల‌గా, ఒత్తుగా క‌న‌బ‌డ‌తాయి. అయితే వీటిని ఉప‌యోగించే ప‌ని లేకుండా స‌హ‌జ సిద్దంగానే మ‌నం క‌నుబొమ్మ‌ల‌ను న‌ల్ల‌గా, ఒత్తుగా మార్చుకోవ‌చ్చు. ఒక చ‌క్క‌టి ఇంటి చిట్కాను ఉప‌యోగించి మ‌నం మ‌న క‌నుబొమ్మ‌ల‌ను అందంగా మార్చుకోవ‌చ్చు.

క‌నుబొమ్మ‌ల‌ను అందంగా మార్చే ఆ చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డం అలాగే వాడ‌డం కూడా చాలా సుల‌భం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం ఒక టీ స్పూన్ క‌ల‌బంద గుజ్జును, ఒక టీ స్పూన్ బాదం నూనెను లేదా ఆముదం నూనెను అలాగే ఒక విట‌మిన్ ఇ ఆయిల్ క్యాప్సుల్ ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ క‌ల‌బంద గుజ్జును అలాగే బాదం నూనెను వేసి క‌ల‌పాలి. త‌రువాత ఇందులో విట‌మిన్ ఇ ఆయిల్ ను వేసి క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని రోజూ రాత్రి ప‌డుకునే ముందు క‌నుబొమ్మ‌ల‌కు దూది స‌హాయంతో రాసుకోవాలి.

follow this remedy for beautiful Eye Brows
Eye Brows

త‌రువాత రెండు నిమిషాల పాటు సున్నితంగా మ‌ర్ద‌నా చేసుకోవాలి. దీనిని రాత్రంతా అలాగే ఉంచుకుని ఉద‌యాన్నే శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్ర‌తిరోజూ రాత్రి ప‌డుకునే ముందు క‌నుబొమ్మ‌ల‌కు ఈ మిశ్ర‌మాన్ని రాసుకోవ‌డం వ‌ల్ల క్ర‌మంగా క‌నుబొమ్మ‌లు ఒత్తుగా, న‌ల్ల‌గా మార‌తాయి. ప‌లుచ‌గా ఉన్న క‌నుబొమ్మ‌లు ఒత్తుగా మార‌తాయి. ఈ విధంగా ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా క‌నుబొమ్మ‌ల‌ను న‌ల్ల‌గా, ఒత్తుగా మార్చుకోవ‌చ్చు.

D

Recent Posts